సింహం..రాజు మధ్యలో డూమ్స్ డే!
2026 డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొననుంది. డిసెంబర్ 17న హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్ డే’ విడుదల కానుండగా, డిసెంబర్ 24న బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’ బరిలోకి దిగనున్నాయి. మల్టీప్లెక్స్ స్క్రీన్ల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్స్ ఈ తెలుగు సినిమాల వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
By: Srikanth Kontham | 19 Nov 2026 8:32 AM IST2026 డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా లేదు. ఒకవైపు టాలీవుడ్ సీనియర్ స్టార్స్ బాక్సాఫీస్ వేటకు సిద్ధమవుతుంటే వారి మధ్యలో హాలీవుడ్ విజువల్ వండర్ `అవెంజర్స్: డూమ్స్ డే` దూసుకొస్తోంది. సింహం గర్జనకు, కింగ్ ఠీవీకి మధ్యలో మార్వెల్ సూపర్ హీరోల హంగామా తోడవడంతో ఉత్కంఠ నెలకొంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే..
నటసింహం బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతోన్న `దాదా` సినిమాపై ఇప్పటికే భారీ అంచ నాలున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తమన్ మ్యూజిక్, బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీన్లతో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడానికి `దాదా` సిద్ధమ వుతున్నాడు. మరోవైపు కింగ్ నాగార్జున ల్యాండ్ మార్క్ 100వ సినిమా `కింగ్ 100` తో అదే రోజున బరిలోకి దిగు తున్నారు. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో టబు, ఆశోక్ సెల్వన్ వంటి భారీ తారాగణంతో వస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.
అయితే `దాదా`, `కింగ్ 100` థియేటర్లలోకి రావడానికి సరిగ్గా వారం రోజుల ముందే డిసెంబర్ 17న హాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `అవెంజర్స్: డూమ్స్ డే` ఇండియాలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే దేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం..మల్టీప్లెక్స్ స్క్రీన్లు అన్నీ దాదాపు ఈ సినిమాకే కేటాయించే పరిస్థితి కనిపించడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇక్కడ అసలైన సవాల్ ఏంటంటే? మల్టీప్లెక్స్ ఆడియన్స్-యూత్ అంతా `అవెంజర్స్` మాయలో ఉన్న సమయం లో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు వసూళ్లను రాబడతాయో. డిసెంబర్ 17న డూమ్స్ డే సునామీ మొదలైతే వారం తర్వాత వచ్చే బాలయ్య `దాదా`, నాగార్జున `కింగ్ 100` చిత్రాలకు థియేటర్ల సర్దుబాటు కీలకంగా మారనుంది. అయితే పండుగ సీజన్ కావడం పైగా సింగిల్ స్క్రీన్లలో తెలుగు సినిమాలకు ఉండే తిరుగులేని ఆదరణ ఈ రెండు చిత్రాలకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ బాక్సాఫీస్ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. `అవెంజర్స్: డూమ్స్ డే` మొదటి వారం తర్వాత కూడా అదే స్థాయిలో వసూళ్లను కొనసాగిస్తే మల్టీప్లెక్స్‌లలో షోల సంఖ్యపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ తెలుగు ప్రేక్షకుల నాడి తెలిసిన బాలకృష్ణ, నాగార్జున చిత్రాలకు ఫ్యామిలీ ..మాస్ ఆడియన్స్ అండగా నిలిస్తే మాత్రం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి. అంతమంగా 2026 ముగింపులో సింహం వేట.. రాజు దర్పం.. సూపర్ హీరోల విన్యాసాలతో థియేటర్ల వద్ద అసలైన సినీ జాతర ఖాయమనిపిస్తోంది.
