బాలయ్య 'దాదా'.. మలినేని ప్లాన్ ఎక్కడా డిస్టర్బ్ కాకుండా..
బాలయ్య సినిమా అంటే అభిమానులకు పెద్ద పండగేనని చెప్పాలి. అందులోనూ వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దాదాపై అంచనాలు మామూలుగా లేవు.
By: M Prashanth | 7 Oct 2026 10:25 PM ISTబాలయ్య సినిమా అంటే అభిమానులకు పెద్ద పండగేనని చెప్పాలి. అందులోనూ వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దాదాపై అంచనాలు మామూలుగా లేవు. అయితే షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో సినిమా షెడ్యూల్ పై ఎఫెక్ట్ పడుతుందేమోనన్న రీసెంట్ గా చర్చ మొదలైంది. కానీ ఇప్పుడు ఆ డౌట్స్ కు చెక్ పెట్టేలా మేకర్స్ వర్క్ మొదలుపెట్టారు.
గాయం నుంచి కోలుకున్న బాలకృష్ణ మళ్లీ షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టారు. మంగళవారం నుంచి మైసూరులో దాదా కొత్త షెడ్యూల్ మొదలైంది. దాన్ని ఫుల్ లెంగ్తీ షెడ్యూల్ గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న టాకీ పార్ట్ ను కంప్లీట్ చేయడంపై దర్శకుడు గోపీచంద్ మలినేని ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు కాజల్ అగర్వాల్, మంచు మనోజ్ కూడా పాల్గొంటున్నారు.
సినిమాలో కీలకమైన సన్నివేశాలను ఇప్పుడు షూట్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్ తో పాటు డ్రామాకు కూడా ఇంపార్టెన్స్ ఉన్న ఆ షెడ్యూల్ ను వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇక్కడే దాదా విషయంలో గోపీచంద్ మలినేని ప్లానింగ్ క్లియర్ గా కనిపిస్తోంది. బాలకృష్ణకు గాయం కావడంతో షూటింగ్ లో కొంత బ్రేక్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ ఎఫెక్ట్ సినిమా విడుదలపై పడకుండా మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అంటే ముందుగా అనుకున్న ప్లాన్ లో పెద్దగా ఛేంజెస్ లేకుండా సినిమాను డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురావడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథలో బాలకృష్ణ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించబోతున్నారు. దీంతో దాదాలో యాక్షన్ కు హై రేంజ్ లో ఇంపార్టెన్స్ ఉండబోతోంది. ఇప్పటికే బాలయ్య మార్క్ మాస్ ఎలివేషన్స్ కు తగ్గట్టుగా సన్నివేశాలను గోపీచంద్ మలినేని సిద్ధం చేసినట్లు మూవీ టీమ్ చెబుతోంది.
మంచు మనోజ్ కూడా కీలకమైన పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుండటంతో బాలయ్య, మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలపై హైప్ పెరిగింది. ఇక షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 24 విడుదల తేదీని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఆ డేట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా టీమ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా బాలయ్య సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో కూడా రిలీజ్ డేట్ ను వేశారు మేకర్స్. సినిమా కచ్చితంగా అదే డేట్ కు తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు క్లియర్ గా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యపీగా ఫీలవుతున్నారు. ఇక మూవీ టీమ్ నుంచి నెక్స్ట్ ఏ అప్డేట్ వస్తుందో.. సినిమా ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.
