Begin typing your search above and press return to search.

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ‘దాదా’ షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘దాదా ధమాకా’ పాటలో బాలయ్య స్వయంగా పాడగా, నర్గీస్ ఫక్రీ సందడి చేశారు. తమన్ సంగీతం అందించారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాగార్జున ‘కింగ్ 100’తో పోటీ ఉన్నా, హిట్ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

By:  Ramesh Palla   |   17 Nov 2026 12:37 AM IST
బాలకృష్ణ దాదా సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!
X

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబోలో రూపొందుతున్న 'దాదా' సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా నుంచి మొదటి పాట వచ్చింది. ఈ పబ్ సాంగ్‌ను స్వయంగా బాలకృష్ణ పాడటంతో ప్రత్యేకంగా నిలిచింది. బాలీవుడ్‌ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఈ ప్రత్యేక పాటలో బాలకృష్ణతో సందడి చేసింది. దాదా ధమాకా అంటూ సాగిన ఈ పాటకు తమన్‌ సంగీతాన్ని అందించాడు. బాలకృష్ణ సినిమా అంటే తమన్‌ ఊగి పోతూ సంగీతాన్ని ఇస్తాడనే టాక్‌ ఉంది. బాలయ్య అభిమానులు సైతం తమన్ మ్యూజిక్ పై నమ్మకం ఉంచుతారు. వరుస సినిమాలకు తమన్‌ సంగీతాన్ని అందిస్తూ మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌ చేస్తున్న విషయం తెల్సిందే. దాదా ధమాకా పాటతో ఈ సినిమాను సైతం మ్యూజికల్‌గా హిట్ చేసే విధంగా తమన్‌ వర్క్‌ చేసినట్లున్నాడు అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ దాదా సినిమా నుంచి...

'దాదా' సినిమాకు ముందు బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబోలో 'వీరసింహారెడ్డి' వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే హిట్‌ పెయిర్‌గా గుర్తింపు దక్కించుకున్న వీళ్లు మరోసారి జత కట్టడం తో వెంటనే అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు దాదా సినిమాపై ఆసక్తి కనబర్చారు. అంతా కోరుకున్నట్లుగానే వీరి కాంబోలో మూవీ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తో బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం అని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. క్రిస్మస్‌ పోటీ భారీగా ఉన్నప్పటికీ బాలయ్య, గోపీచంద్‌ కాంబో హిట్‌ పెయిర్‌ కనుక కచ్చితంగా దాదా సినిమాకు హిట్ టాక్‌ దక్కడంతో పాటు, భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం అని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

'దాదా' సినిమా ఓటీటీ బిజినెస్‌...

సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఇప్పటికే పలు ఏరియాలో భారీ మొత్తానికి బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమాను వృద్ది సినిమాస్ బ్యానర్‌లో సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో నిర్మాత సతీష్ కిలారుకు విడుదలకు ముందే టేబుల్‌ ప్రాఫిట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ బిజినెస్ సైతం భారీ మొత్తంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. కొందరు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ దాదా సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని, క్రిస్మస్‌ కు సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే, సంక్రాంతికి ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మాట్లాడుతున్నారు. మొత్తానికి దాదా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ అదుర్స్‌ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్‌ లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

కింగ్‌ 100 వర్సెస్‌ దాదా...

'దాదా' సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇప్పటికే వీరి కాంబో భగవంత్ కేసరితో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకుంది. కనుక మరోసారి బాలకృష్ణ, కాజల్‌ కాంబో హిట్‌ను దక్కించుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో మంచు మనోజ్‌, సముద్రఖని, శరత్‌ కుమార్‌, ఉపేంద్ర లిమాయే, అభిమన్యు సింగ్‌ తదితరలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు, యాక్షన్‌ పార్ట్‌ షూట్‌ పూర్తి అయిందని, ఈ నెల చివరి వరకు మొత్తం షూటింగ్‌ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో వైపు సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తూనే ఉంది. డిసెంబర్‌ 10 లేదా 15వ తారీకు వరకు ఫస్ట్‌ కాపీ రెడీ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. నాగార్జున కింగ్‌ 100 సినిమా నుంచి గట్టి పోటీ ఉండబోతున్నప్పటికీ హిట్‌ కాంబో కావడంతో 'దాదా' సినిమాపై అభిమానుల్లో నమ్మకం కనిపిస్తోంది.