#DADA హంగామా: బాలకృష్ణ కొత్త అవతారంపై SMలో రచ్చ రచ్చ
నందమూరి బాలకృష్ణ - మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం #DADA.
By: Sivaji Kontham | 8 Sept 2026 9:12 AM ISTనందమూరి బాలకృష్ణ - మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం #DADA. `వీరసింహారెడ్డి` వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్స్‌పై అభిమానులు, నెటిజన్ల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. టైటిల్ సెలెక్షన్, బాలకృష్ణ కొత్త లుక్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది. అలాగే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలని ఆశిస్తూ.. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
గోపీచంద్ మలినేని టేకింగ్‌పై నందమూరి అభిమానులు అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది దర్శకులు బాలయ్య మాస్ ఇమేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని.. కానీ గోపీచంద్ ఆయనలోని మాస్ పవర్‌ను సరిగ్గా ప్రజెంట్ చేసి అద్భుతాలు క్రియేట్ చేయగలరని అభిమానులు కొనియాడుతున్నారు. ఈసారి సినిమాలో సంభాషణలు సుదీర్ఘంగా కాకుండా పవర్‌ఫుల్ సింగిల్ లైనర్లుగా ఉండాలని... సంగీత దర్శకుడు తమన్ అందించే మాస్ మ్యూజిక్, డప్పుల మోత థియేటర్లను ఊపేయాలని కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమా టెక్నికల్ యాస్పెక్ట్స్ , యాక్షన్ సీన్స్ విషయంలో కూడా అభిమానులు తమ అమూల్యమైన సూచనలను అందిస్తున్నారు. కెమెరా వర్క్ ప్రత్యేకంగా ఉండేలా.. ముఖ్యంగా మోకో బాబ్ కెమెరాతో ఒక వినూత్నమైన ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేయాలని నెటిజన్లు గోపీచంద్‌ను కోరుతున్నారు. అంతేకాకుండా.. ఈ సినిమాతో బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల షేర్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కొందరు సినీ ప్రేమికులు ఈ సినిమా కంటెంట్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం ఫైట్లు -మాస్ ఎలిమెంట్స్‌కే ప్రాధాన్యత ఇవ్వకుండా.. బలమైన కథ- కథనంపై దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు. నేటి ట్రెండ్‌లో ఎంత చిన్న హీరో అయినా కంటెంట్ బాగుంటే రూ. 250 కోట్ల వసూళ్లను సాధిస్తున్నారని.. కాబట్టి `వీరసింహారెడ్డి` కంటే మిన్నగా కంటెంట్ ఉన్న యాక్షన్ డ్రామాగా దీనిని మలచాలని కోరుకుంటున్నారు.
గోపీచంద్ మలినేని-బాలకృష్ణ ప్రాజెక్ట్‌కు కేవలం నందమూరి అభిమానుల నుండే కాకుండా.. ఇతర హీరోల అభిమానుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తోంది. అక్కినేని నాగార్జున అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు #DADA చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. థియేటర్లను షేక్ చేసే స్థాయిలో గోపీచంద్ ప్లానింగ్ ఉందనే వార్తలతో.. ఈ సినిమాకి సంబంధించిన తదుపరి అప్‌డేట్స్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంతలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని త్వరలోనే `దాదా` నుంచి మాస్ సాంగ్స్, ట్రైలర్ , పవర్‌ఫుల్ అప్‌డేట్స్‌తో ప్రమోషన్ల జాతర షురూ చేసి అభిమానులకు పూనకాలు తెప్పించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, శరత్‌కుమార్, సముద్రఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
