రవితేజ, మెగా హీరో ప్లేస్‌లో బాలకృష్ణ రానున్నాడా?
బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ సినిమా 2026 క్రిస్మస్ నుంచి వాయిదా పడి 2027 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రవితేజ ‘దాగుడు మూతలు దండాకోర్’, సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్య సంక్రాంతి బరిలో దిగితే చిరంజీవి సినిమాలు, అనిల్ రావిపూడి చిత్రంతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
By: Ramesh Palla | 29 Nov 2026 1:00 AM ISTనందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'దాదా' సినిమా 2026 క్రిస్మస్ కానుకగా విడుదల కానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చెప్పిన డేట్ కి కాకుండా ఆలస్యంగా విడుదల అవుతున్నాయి. కనుక దాదా సినిమా సైతం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. క్రిస్మస్ బరి నుంచి తప్పుకోబోతున్న దాదా సినిమాను 2027 సంక్రాంతి రేసులో నిలిపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో సంక్రాంతికి చాలా సార్లు వచ్చిన బాలకృష్ణకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ సంక్రాంతికి వచ్చిన పలు సినిమాలతో బాలకృష్ణ హిట్ కొట్టాడు. అందుకే దాదా సినిమాను సైతం 2027 సంక్రాంతికి విడుదల చేయడం ద్వారా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హిట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయని అభిమానులు భావిస్తున్నారు.
రవితేజ దాగుడు మూతలు దండాకోర్...
ఈ ఏడాది ఆరంభంలో 2027 సంక్రాంతికి మేము వస్తాం అంటే మేము వస్తాం అంటూ చాలా మంది హీరోలు కర్ఛీఫ్‌లు వేసుకున్నారు. అందులో రవితేజ కూడా ఒకరు అనే విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మాణంలో రవితేజ హీరోగా 'దాగుడు మూతలు దండాకోర్' అనే టైటిల్‌తో ఒక సినిమా రూపొందుతోంది, ఆ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. స్వయంగా దిల్ రాజు సైతం 2027 సంక్రాంతికి మేము రవితేజతో కలిసి వస్తామని చెప్పారు. కారణాలు ఏంటో తెలియదు కానీ సినిమా సంక్రాంతికి రావడం లేదు. అసలు సినిమా ఉందా లేదా అనే విషయమై క్లారిటీ లేదు. ఆ మధ్య దిల్ రాజు ఆ విషయమై స్పందించడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. దాంతో సినిమా పై అనుమానాలు ఉన్నాయి. దాంతో 2027 సంక్రాంతి రేసు నుంచి రవితేజ తప్పకున్నట్లు అయింది.
బాలకృష్ణ దాదా సినిమాతో సంక్రాంతికి...
సంక్రాంతికి వస్తామని చెప్పిన మరో సినిమా కూడా వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాను సైతం సంక్రాంతి 2027 కి విడుదల చేయాలని భావించారు. కానీ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇంతలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి హడావిడి మొదలు కావడంతో సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని తేలిపోయింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో మెల్లగా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. దాంతో 2027 సంక్రాంతికి వస్తాం అని చెప్పిన రవితేజ, సాయి ధరమ్ తేజ్‌లు బరి నుంచి తప్పుకున్నట్లు అయింది. ఆ స్థానంలో ఒకటి రెండు చిన్న సినిమాలు మేము ఉన్నాం అని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బాలకృష్ణను సినిమాల ప్లేస్‌లో దించే యోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
చిరంజీవి కాకా, విశ్వంభర రిలీజ్...
బాలకృష్ణ గతంలో సంక్రాంతికి వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి దాదా సినిమాతో ఆ సక్సెస్ ను రిపీట్ చేస్తాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. గతంలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి వీరి కాంబో మూవీ అనగానే అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. పైగా గత మూడు నాలుగు ఏళ్లుగా బాలకృష్ణ వరుసగా హిట్స్ కొడుతూ వస్తున్నాడు. మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేస్తున్నాయి. అందుకే ఈ సినిమాను సంక్రాంతికి వసూళ్లు చేయడం ద్వారా ఇతర సినిమాలకు గట్టి పోటీ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన కాకా లేదా విశ్వంభర సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చిన ఆశ్చర్యం లేదని అంటున్నారు. కనుక చిరంజీవితో బాలకృష్ణ బిగ్ ఫైట్ ఉండబోతుంది. మరో వైపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల సైతం సంక్రాంతికి రాబోతుంది. కనుక బాలయ్య దాదా గా సంక్రాంతికి వస్తే ఈక్వెషన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి.
