Begin typing your search above and press return to search.

సీనియర్ ఎన్టీఆర్ కి దక్కనివి.. బాలయ్యకి దక్కుతున్నాయి !

నందమూరి బాలకృష్ణ తెర మీద మంచి నటుడు. తెర వెనక కల్మషం లేని మనిషి. బోళాగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు.

By:  Satya P   |   27 March 2026 9:45 AM IST
సీనియర్ ఎన్టీఆర్ కి దక్కనివి.. బాలయ్యకి దక్కుతున్నాయి !
X

నందమూరి బాలకృష్ణ తెర మీద మంచి నటుడు. తెర వెనక కల్మషం లేని మనిషి. బోళాగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. అందుకే ఆయనను ఎంతో మంది అభిమానిస్తారు. ఇక ఎన్టీఆర్ వంటి మేరు పర్వతం లాంటి మహా నటుడి వారసత్వాన్ని కొనసాగించేందుకు అయిదు దశాబ్దాల క్రితం తానుగా ముందుకు వచ్చారు. అది ఎంత కష్టమో ఆయనకు ఆచరణలో అర్ధం అయింది. అయినా పట్టుదలగా పరిశ్రమించి తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకున్నారు. తండ్రి మాదిరిగానే పౌరాణిక చారిత్రక జానపద సాంఘిక చిత్రాలలో నటించారు. వాటికి అదనంగా ఫ్రాక్షన్, సైన్స్ ఫిక్షన్ చిత్రాలు కూడా బాలయ్య చేయడం విశేషం.

అవార్డుల వరద :

బాలయ్యకు ఒక దశలో నంది అవార్డు రావడమే చాలా లేట్ అయింది అన్న మాట ఉంది. ఆయన నటించిన భైరవ ద్వీపం కానీ ఆదిత్య 369 వంటి చిత్రాలు కానీ నంది అవార్డుకు అర్హమైనప్పటికీ ఎందుకో రాలేదని అభిమానులు ఆవేదనతో చెబుతారు. ఎట్టకేలకు ఆయనకు 1999లో సమర సింహా రెడ్డి మూవీకి తొలిసారి నంది అవార్డు వచ్చింది. ఆ తరువాత నరసింహ నాయుడికి వచ్చింది. ఇక సింహ మూవీకి మరోసారి వచ్చింది. ఇలా ఉత్తమ నటుడిగా అవార్డులు దక్కాయి. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి అఖండ వంటి సినిమాలకు అవార్డులు దక్కాల్సిందే ఆ సమయంలో ప్రభుత్వ అవార్డులు లేవు. ఇక భగవత్ కేసరికి కేంద్ర అవార్డు దక్కింది అదే సమయంలో పద్మభూషణ్ అవార్డు ఆయనను వరించింది. అంతే కాకుండా తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ అవార్డుని అందుకున్నారు ఇక లేటెస్ట్ గా ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వేదికగా బాలయ్య లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని అందుకున్నారు. ఇదే వరసలో మరిన్ని అవార్డులు ఆయనను చేరేందుకు ఎదురు చూస్తున్నాయని అభిమానులు సంబర పడుతున్నారు.

ఎన్టీఆర్ విషయంలో :

ఇదిలా ఉంటే దాదాపుగా మూడు వందల యాభై దాకా సినిమాల్లో అద్భుతమైన నటనా పటిమను చూపించిన ఎన్టీఆర్ కి అవార్డులు అయితే పెద్దగా దక్కలేదు. ఆయన కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగా అభిరుచి కలిగిన నిర్మాతగా తన ఖ్యాతిని చాటుకున్నారు. అదే విధంగా వివిధ శాఖలో తన ప్రావీణ్యం చూపించారు. తెలుగు సినిమాకు మూడున్నర దశాబ్దాల పాటు సేవ చేసిన ఎన్టీఆర్ కి 1968లో పద్మశ్రీ మాత్రమే లభించింది. ఆ తరువాత ఎందుకో అవార్డులు ఆయనను దూరం పెట్టాయి. ఆ ఆవేదన అయితే ఆయన అభిమానులలో నిండుగా ఉంది. ఆయన సమకాలీనులు అయిన దక్షిణాది భాషా చిత్ర నటులకు ఎన్నో అవార్డులు దక్కడం అంతా చూశారు.

లోటు తీరుస్తున్నారా :

మొత్తం మీద చాలా కాలానికి నందమూరి వారి కుటుంబంలో అవార్డుల పంట పండుతోంది. అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు బాలయ్యను వరిస్తున్నాయి. దాంతో అన్న గారికి ఈ విషయంలో జరిగిన అన్యాయాన్నికి ఇపుడు సరైనా న్యాయంగా అభిమానులు భావిస్తున్నారు. అంతే కాదు బాలయ్య సుదీర్ఘంగా నటుడిగా కొనసాగుతూ ఈ రోజు నా టాప్ స్టార్ గా ఉన్నారు. దాంతో ఇంకా ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డులు ఆయనను ఫ్యూచర్ లో వరించడం ఖాయమని ధీమా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.