బాలయ్య సీఎం సీటు ఎక్కితే.. పొలిటికల్ గేమ్‌లో ట్విస్ట్ ఇదేనా?
టాలీవుడ్ మాస్ సినిమాలకు ఒక లెక్క ఉంటుంది, కానీ ఆ మాస్‌కు ఒక పవర్‌ఫుల్ పర్పస్ తోడైతే వచ్చే కిక్కే వేరు.
By: M Prashanth | 3 May 2026 5:20 PM ISTటాలీవుడ్ మాస్ సినిమాలకు ఒక లెక్క ఉంటుంది, కానీ ఆ మాస్‌కు ఒక పవర్‌ఫుల్ పర్పస్ తోడైతే వచ్చే కిక్కే వేరు. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న NBK112 గురించి అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అసలు కొరటాల శివ ఈసారి బాలయ్యను ఏ లుక్‌లో చూపించబోతున్నారో అన్న దానిపై అభిమానుల్లో ఒక ఆసక్తి ఉంది. కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా, ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక బలమైన కథా నేపథ్యం ఉందనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో ఊపందుకుంది.
సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరో ఒక ఊరినో, ఒక వ్యవస్థనో మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈసారి బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా అంతకంటే పెద్ద రేంజ్ లోనే ఏదో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో "Power Meets Purpose" అనే ట్యాగ్ లైన్ చూస్తుంటే, అది కేవలం మాటలకే పరిమితం కాదని, స్క్రిప్ట్ లో కూడా ఆ ఇంటెన్సిటీ గట్టిగానే ఉంటుందని అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ముహూర్తం పూర్తి చేసుకుని జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్లడానికి సిద్ధంగా ఉంది.
ఇక అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాలో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్రానికి సీఎం అయ్యే స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి ప్రయాణంగా ఈ సినిమా సాగుతుందనే టాక్ నడుస్తోంది. కొరటాల శివ ఇప్పటికే భరత్ అనే నేను లాంటి పొలిటికల్ డ్రామాతో హిట్ కొట్టినప్పటికీ, ఈసారి బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పదునైన డైలాగులతో ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఒకవేళ బాలయ్య సీఎం సీటులో కనిపిస్తే థియేటర్లలో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. తన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో రాజకీయాల్లోని కుతంత్రాలను ఎదిరించే సీక్వెన్స్ లు ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయని తెలుస్తోంది. కొరటాల శివ తన మార్కు సోషల్ మెసేజ్ ను బాలయ్య మాస్ ఎనర్జీతో కలిపి ఒక కొత్త రకమైన "మూవ్ మెంట్" క్రియేట్ చేయాలని ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ సీఎం క్యారెక్టరైజేషన్ గురించి వస్తున్న గాసిప్స్ ఇప్పుడు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.
భరత్ అనే నేనులో మహేష్ బాబును ఒక క్లాస్ సీఎంగా కనిపిస్తే ఇప్పుడు బాలయ్య మాస్ రోల్ చేస్తాడని అర్ధమవుతుంది. ఇక బాలయ్య తన 112వ సినిమాలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో కనిపిస్తూనే, తనదైన స్టైల్ లో విలన్ల తాట తీయబోతున్నారనేది పక్కా అనిపిస్తోంది. అఖండ 2 వంటి ఫ్లాప్ తర్వాత బాక్సాఫీస్ వద్ద మళ్ళీ సత్తా చాటాలని చూస్తున్న బాలయ్యకు, కొరటాల శివ అందించే ఈ పొలిటికల్ సబ్జెక్ట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో చూడాలి.
