Begin typing your search above and press return to search.

అఖండ 'తాండవం'.. బాలయ్య కోసం ఇద్దరు లెజెండ్స్!

'అఖండ'.. ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ రికార్డులతో పాటు, థమన్ కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొస్తుంది.

By:  M Prashanth   |   5 Nov 2025 9:45 PM IST
అఖండ తాండవం.. బాలయ్య కోసం ఇద్దరు లెజెండ్స్!
X

'అఖండ'.. ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ రికార్డులతో పాటు, థమన్ కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొస్తుంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఆ సినిమా ఒక ఊపు ఊపేస్తే, అందులోని అఘోరా థీమ్ సాంగ్స్, మ్యూజిక్ మాత్రం ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు, ఈ క్రేజీ కాంబో మళ్లీ అదే వైబ్ ఇవ్వడానికి సిద్ధమైంది. సహజంగానే, ఈ సీక్వెల్ మ్యూజిక్ ఆల్బమ్‌పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక సాలిడ్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. 'అఖండ 2' నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించాడు. ఈ అప్‌డేట్ కోసం థమన్ వదిలిన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది, ఇది ఆల్బమ్‌కే హైలైట్‌గా నిలిచే మెయిన్ ట్రాక్ అని.

బాలయ్య అఘోరా గెటప్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తుండగా, ఈ పాట పేరును "అఖండ తాండవం" అంటూ థమన్ తన ట్వీట్‌లో రివీల్ చేశాడు. ఇది ఒక "మాసివ్ ప్రొడ్యూస్డ్ ట్రాక్" అని కూడా హింట్ ఇచ్చి, హైప్ పెంచేశాడు. థమన్ ఈసారి స్కెచ్ మామూలుగా వేయలేదు.

ఏకంగా ఇద్దరు ఇండియన్ మ్యూజికల్ లెజెండ్స్‌ను ఈ ఒక్క పాట కోసం రంగంలోకి దించాడు. పవర్‌ఫుల్ వాయిస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ మహదేవన్, హత్తుకునే గాత్రంతో మెస్మరైజ్ చేసే కైలాష్ ఖేర్.. ఈ ఇద్దరూ కలిసి ఈ "తాండవం" సాంగ్‌ను పాడారు.

బాలయ్య అఘోరా ఎలివేషన్స్‌కు, బోయపాటి మార్క్ సీన్స్‌కు ఈ ఇద్దరి పవర్‌హౌస్ వాయిస్‌లు ఏ రేంజ్‌లో సెట్ అవుతాయో ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తున్నాయి. నందమూరి ఫ్యాన్స్ ఈ మ్యూజికల్ బ్లాస్ట్ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పనిలేదు.

ఈ "తాండవం" సాంగ్ ప్రోమోను నవంబర్ 7న, ఫుల్ లిరికల్ సాంగ్‌ను నవంబర్ 9న విడుదల చేయనున్నట్లు థమన్ అధికారికంగా ప్రకటించాడు. ఒక్క పాటకే ఈ రేంజ్ ప్లానింగ్ ఉంటే, ఇక డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న పూర్తి సినిమా ఇంకెలా ఉండబోతోందో అని జై బాలయ్య హ్యాష్‌టాగ్‌తో ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ దెబ్బతో 'అఖండ' మ్యూజికల్ ఫీస్ట్ మళ్లీ మొదలైనట్లే అని అంటున్నారు. మరి థమన్ వర్క్ ఈ సారి ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి.