Begin typing your search above and press return to search.

'అఖండ 2' మాస్ సాంగ్.. అంతకుమించి అనేలా..

'అఖండ 2' టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇప్పటికే విడుదలైన "అఖండ తాండవం" పాట డివోషనల్ వైబ్స్‌తో చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు అభిమానులు అసలైన మాస్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు.

By:  M Prashanth   |   17 Nov 2025 11:51 AM IST
అఖండ 2 మాస్ సాంగ్.. అంతకుమించి అనేలా..
X

'అఖండ 2' టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. ఇప్పటికే విడుదలైన "అఖండ తాండవం" పాట డివోషనల్ వైబ్స్‌తో చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు అభిమానులు అసలైన మాస్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. 'అఖండ'లో "జై బాలయ్య" పాట ఏ స్థాయిలో ఊగిపోయేలా చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ పాటను మించిన డ్యాన్స్ నంబర్ 'అఖండ 2'లో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది.

సినిమా నుంచి రెండో సింగిల్‌గా "జాజికాయ జాజికాయ" పాటను నవంబర్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాట ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ఈ మధ్య కాలంలో వచ్చిన మాస్ పాటలన్నింటికంటే ఇది హై లెవెల్‌లో ఉండబోతోందని సమాచారం. థమన్ మరోసారి తన మ్యూజిక్‌తో థియేటర్లు దద్దరిల్లేలా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఈ పాటకు సంబంధించిన పోస్టర్ కూడా ఈ అంచనాలను పెంచేసింది. స్టైలిష్ డ్రెస్ లో బాలకృష్ణ, ఆయన పక్కన హీరోయిన్ సంయుక్త గ్లామరస్ లుక్‌లో కనిపించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, బాలయ్య మాస్ స్టెప్పులు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. "జై బాలయ్య" పాటను మించిన ఊపు ఈ పాటలో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

బోయపాటి శ్రీను సినిమాల్లో స్పెషల్ మాస్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. ఈసారి కూడా థమన్, బోయపాటి కలిసి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఈ పాటను డిజైన్ చేశారట. "అదిరిపోయే మాస్ నంబర్"గా ప్రచారం జరుగుతున్న ఈ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ పాటపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ దీన్ని సింపుల్‌గా యూట్యూబ్‌లో కాకుండా, మాస్ సెంటర్‌ అయిన వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో గ్రాండ్ ఈవెంట్‌గా లాంచ్ చేస్తున్నారు. నవంబర్ 18న సాయంత్రం 5 గంటల నుంచి ఈ పాట వైరల్ అవుతుందని చెప్పవచ్చు.

"తాండవం" పాటతో అఘోరా విశ్వరూపం చూపించిన టీమ్, ఇప్పుడు "జాజికాయ"తో బాలయ్యలోని మాస్ ఎనర్జీని చూపించబోతోంది. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు, ఈ పాట మరో పెద్ద హైలైట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.