బాలయ్య 'అఖండ-2'.. బోయపాటికి ఇప్పుడు అవసరం!
ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న అఖండ 2పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
By: M Prashanth | 11 Dec 2025 2:13 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో సందడి మొదలు కానుంది.
ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న అఖండ 2పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కో అప్డేట్ తో మేకర్స్ వాటిని పెంచుకుంటూ పోతున్నారు. కొత్త కొత్త అప్డేట్స్ తో సందడి చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనా సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మేకర్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను అని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు భారీ హిట్ అవసరం. చాలా కీలకం కూడా. బాలయ్యతో అఖండ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న బోయపాటి.. ఆ తర్వాత నుంచి ఇప్పటి ఒక్క మూవీ మాత్రమే రూపొందించారు. అదే రామ్ పోతినేని స్కంద.
భారీ అంచనాల మధ్య రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన స్కంద మూవీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ సమయంలో బోయపాటి శ్రీను విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. స్కంద తర్వాత అఖండ 2 తాండవంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.
అయితే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. ఒక్కటి కూడా నిరాశపరిచిందని చెప్పలేం. సింహ, లెజెండ్, అఖండ.. మూడు కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా వర్కౌట్ అయ్యాయి.
కాబట్టి ఇప్పుడు అఖండ 2 క్లిక్ అవుతుందని కూడా అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కోసం బోయపాటి కొన్ని నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారు. దర్శకత్వం వహించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు మూవీని తీర్చిదిద్దారని తెలుస్తోంది. అదే సమయంలో అఖండ విజయం.. బోయపాటికి నెక్స్ట్ మూవీ విషయంలో హెల్ప్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయన తన తదుపరి సినిమా చేయనున్నారని సమాచారం. మరి అఖండ 2 తాండవం ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో వేచి చూడాలి.
