Begin typing your search above and press return to search.

వామ్మో.. బాలయ్య ఓపికకి దండం!

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ 'దాదా' సినిమా షూటింగ్‌ పూర్తి చేసేందుకు రెడీగా ఉన్నాడు.

By:  Ramesh Palla   |   10 Sept 2026 8:00 PM IST
వామ్మో.. బాలయ్య ఓపికకి దండం!
X

నందమూరి బాలకృష్ణ ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తూ సీనియర్‌ హీరోలతో పాటు, జూనియర్‌ హీరోలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేసినప్పుడే ఇండస్ట్రీ బతుకుతుందని పెద్దలు అంటారు. కానీ స్టార్ హీరోలు ఒక్క సినిమాకు ఏళ్లకు ఏళ్లు తీసుకుంటున్నారు. చాలా మంది హీరోలు ఏడాదికి కనీసం ఒక్క సినిమా విడుదల చేయలేక పోతున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఏడాదిలో రెండు సినిమాలు చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఆయనకు షూటింగ్‌లో గాయం కారణంగా రెండో సినిమాను చేసే అవకాశం దక్కలేదు. కానీ దాదా సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడి ఉండకుంటే ఇప్పటికే ఆ సినిమా పూర్తి చేసి కొరటాల శివ సినిమాను మొదలు పెట్టి ఉండేవాడు. మోకాలికి ఆపరేషన్‌ తర్వాత బాలకృష్ణ కనీసం మూడు నుంచి ఐదు నెలల విశ్రాంతి తీసుకుంటాడని అంతా భావించారు. కానీ అప్పుడే బాలయ్య షూటింగ్‌కు వచ్చేశాడు.

బాలకృష్ణ దాదా సినిమా షూటింగ్‌...

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ 'దాదా' సినిమా షూటింగ్‌ పూర్తి చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పటికే సినిమాను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. కనుక ఆ తేదీకి సినిమా విడుదల చేయడం కోసం బాలకృష్ణ తన పూర్తి సహకారం అందించేందుకు రెడీగా ఉన్నాడట. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే బాలకృష్ణ దాదా సినిమాను ఎలాంటి అనుమానం లేకుండా ఈ ఏడాది చివర్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటన చేశారు. బాలకృష్ణ హామీతోనే విడుదల తేదీని ప్రకటించారని తెలుస్తోంది. అంత పెద్ద సర్జరీ అయినా కూడా బాలకృష్ణ చాలా త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. దాదా సినిమా మాత్రమే కాకుండా మరో సినిమాను బాలయ్య ప్రారంభించబోతున్నాడు.

దాదా సినిమాను క్రిస్మస్‌ కానుకగా...

దాదా సినిమా షూటింగ్‌ మధ్యలో ఉంది, రిలీజ్ డేట్‌ ను ప్రకటించారు కనుక బాలకృష్ణ ఆ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసేందుకు కాస్త ఇబ్బంది అయినా వస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ దాదా సినిమా షూటింగ్‌ పూర్తి కావడమే ఆలస్యం తన తదుపరి సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా మేకర్స్‌ కు తెలియజేశాడట. అక్టోబర్‌ నుంచి కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయింది. షూటింగ్‌ కోసం ఏర్పాట్లు మొదలు అయ్యాయి. రెండు మూడు వారాల్లో కావాల్సిన లొకేషన్స్‌, సెట్స్ సైతం ఫైనల్‌ చేయాలని ప్రొడక్షన్‌ టీంకి కొరటాల శివ ఆదేశించాడట. బాలకృష్ణ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం వల్లే కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ వేగవంతం చేశాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

బాలకృష్ణ, కొరటాల శివ మూవీ అప్‌డేట్‌..

బాలకృష్ణ వయస్సు 66 ఏళ్లు. ఈ వయసులో ఎవరైనా చిన్న శస్త్రచికిత్స అయితేనే నెలల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే కాకుండా తిరిగి పూర్తి ఆరోగ్యంగా మారి, యాక్షన్‌ సీన్స్ వంటివి చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ బాలకృష్ణ చాలా సింపుల్‌గానే తీవ్రమైన గాయం నుంచి కోలుకున్నాడు. అంతే కాకుండా బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే ఆయనను చూసి చాలామంది బాబోయ్ బాలకృష్ణ ఓపికకి దండం పెట్టొచ్చు అంటున్నారు. బాలయ్య తరంకు చెందిన ఇతర హీరోలు ఇంత స్పీడ్‌గా సినిమాలు చేయడం లేదు. కేవలం బాలకృష్ణ మాత్రమే ఇంత స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథల ఎంపిక మొదలుకుని ప్రతి విషయంలోనూ బాలకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అయినా ఇంత స్పీడ్‌గా సినిమాలు ఎలా చేస్తున్నాడో అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నాలుగు ఏళ్లుగా బాలయ్య సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్లుగా విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నాయి. కనుక ఈ క్రిస్మస్‌కి రాబోతున్న దాదా సినిమాతో పాటు, వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు రానున్న కొరటాల శివ సినిమా సైతం గ్యారెంటీ హిట్‌ అని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.