ఇంకా 'పుష్ప' ఫీవర్.. బాలయ్య బాబు తగ్గేదేలే
ఈ నేపథ్యంలో ఒక ఎనర్జిటిక్ పాట ప్లే అవుతోంది. వేదికపై ఎన్బీకే తనదైన శైలిలో తొడకొడుతూ సరదాగా చిల్ అవుతూ కనిపించారు.
By: Sivaji Kontham | 14 Aug 2025 9:50 AM ISTనటసింహా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఎన్బీకే తన లైఫ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ను అమరావతిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని 21 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు భూమిపూజ చేసారు. హైదరాబాద్ తర్వాత మళ్లీ అంతకుమించి అనేలా ఈ క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.
ఎన్బీకే తన వృత్తి ప్రవృత్తి పరంగా ఎలా ఉన్నా కానీ, తన ఇండస్ట్రీ స్నేహితులు సహా ఇతర రంగాల ప్రముఖులతో ఎంతో జోవియల్ గా సరదాగా కలిసిపోతుంటారు. వారితో ఈవెంట్లలో చేసే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఆహా ఓటీటీ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి ఒక కార్యక్రమంలో చేసిన సందడి ఆసక్తిని కలిగించింది. వేదికపై ఎన్బీకే, అల్లు అరవింద్ సహా అతిథులంతా ఫుల్ గా సూట్స్ లో బాస్ వైబ్స్ తో కనిపించారు. వీరంతా మెడలో నిమ్మకాయల హారాలు ధరించి కనిపించడం ఆసక్తిని కలిగించింది.
ఈ నేపథ్యంలో ఒక ఎనర్జిటిక్ పాట ప్లే అవుతోంది. వేదికపై ఎన్బీకే తనదైన శైలిలో తొడకొడుతూ సరదాగా చిల్ అవుతూ కనిపించారు. అల్లు అరవింద్, బాలయ్య సహా ప్రముఖులంతా 'పుష్ప' సిగ్నేచర్ ఎక్స్ ప్రెషన్ ని ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. బాలయ్య బాబు తగ్గేదేలే! అంటూ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. 'ఆహా'లో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్బీకే - అరవింద్ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఫ్యాన్స్ లో చర్చకు వచ్చింది. ఈ జోడీ కలిసి ఓ సినిమా చేయాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
