Begin typing your search above and press return to search.

అఖండ 2 రోర్ టీజర్: సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో..

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ కాంబినేషన్లో వచ్చే కంటెంట్ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఆ వైబ్రేషన్స్ హై లెవెల్‌లో ఉంటాయి.

By:  M Prashanth   |   24 Oct 2025 5:46 PM IST
అఖండ 2 రోర్ టీజర్: సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో..
X

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ కాంబినేషన్లో వచ్చే కంటెంట్ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఆ వైబ్రేషన్స్ హై లెవెల్‌లో ఉంటాయి. 'సింహా', 'లెజెండ్', 'అఖండ'.. ఇలా ప్రతీసారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ క్రేజీ కాంబో, ఇప్పుడు నాలుగోసారి 'అఖండ 2: తాండవం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన బర్త్‌డే గ్లింప్స్ సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ అప్‌డేట్‌తో టీమ్ వచ్చేసింది.




లేటెస్ట్ గా, 'అఖండ 2' నుంచి "బ్లాస్టింగ్ రోర్" పేరుతో ఒక యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా, బాలయ్య మార్క్ పవర్‌తో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో బాలకృష్ణ అఘోర క్యారెక్టర్ కాకుండా కామన్ మ్యాన్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. బోయపాటి తనదైన స్టైల్‌లో డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, బాలయ్య ఎనర్జీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. విజువల్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

అయితే, ఈ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది బాలకృష్ణ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్. "సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. ఏ సౌండ్ కు నవ్వుతానో.. ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలీదు" అంటూ బాలయ్య తనదైన స్టైల్‌లో, గంభీరమైన వాయిస్‌తో చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క డైలాగ్ చాలు, సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో చెప్పడానికి.

టీజర్‌లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్, సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. యాక్షన్ కొరియోగ్రఫీ, బాలయ్య పెర్ఫార్మెన్స్ కు థియేటర్లలో విజిల్స్ తో పెద్ద వేవ్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. మొదటి 'అఖండ'లో చూపించిన రెండు విభిన్న పాత్రల తరహాలోనే, ఇందులో కూడా బాలకృష్ణ తన నటనతో, క్యారెక్టర్ వేరియేషన్స్‌తో అదరగొట్టబోతున్నారని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కనిపించనుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.