అఖండ 2 : సెకండ్ హాఫ్ చాలా స్పెషల్..!
తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ అనుసారం అఖండ 2 సినిమా సనాతన ధర్మంను గురించి వివరిస్తూనే, ఒక మంచి కమర్షియల్ మూవీగా నిలువనుంది అంటున్నారు.
By: Ramesh Palla | 13 Oct 2025 10:58 AM ISTనందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం రూపొందుతున్న అఖండ 2 సినిమాపై అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 సినిమా రూపొందుతున్న నేపథ్యంలో నందమూరి అభిమానుల్లో మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అఖండ 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం తుది దశ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. అంతే కాకుండా అఖండ 2 సినిమా కోసం తమన్ చాలా ప్రత్యేకమైన మ్యూజిక్ ను రెడీ చేస్తున్నాడు. అఖండ రికార్డ్‌లు బ్రేక్ అయ్యేలా అఖండ 2 ఉండబోతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
అఖండ 2 సెకండ్ హాఫ్ సీన్స్
తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ అనుసారం అఖండ 2 సినిమా సనాతన ధర్మంను గురించి వివరిస్తూనే, ఒక మంచి కమర్షియల్ మూవీగా నిలువనుంది అంటున్నారు. ముఖ్యంగా అఖండ 2 సినిమాలో వచ్చే సెకండ్ హాఫ్ సీన్స్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటాయట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు అలాంటి సీన్స్ వచ్చి ఉండవు అని చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకు అది కూడా సీనియర్ హీరో సినిమాకు ఈ స్థాయిలో బజ్ క్రియేట్ కావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. బాలకృష్ణ సాదారణంగానే ఇలాంటి సినిమాలకు ది బెస్ట్ ఇస్తాడు. అలాంటిది బోయపాటి సినిమా, అది కూడా యాక్షన్ ప్రధానంగా సాగే సినిమాకు ఆయన నుంచి సహకారం ఏ స్థాయిలో అంది ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ 2 కోసం ఆయన నూటికి నూరు ఇచ్చి ఉంటాడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా..
అఖండ 2 సినిమా సెకండ్ హాఫ్ గురించి మొదటి నుంచి ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజువల్ వండర్‌గా ఉండటం మాత్రమే కాకుండా సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లడం, ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా సెకండ్ హాఫ్ సీన్స్‌ను దర్శకుడు బోయపాటి డిజైన్ చేశాడని, అందుకే నెవ్వర్ బిఫోర్ అంటూ యూనిట్ సభ్యులు చాలా బలంగా వాదిస్తున్నారు అని బాలకృష్ణ అభిమానులు అంటున్నారు. అఖండ 2 సినిమా కోసం తమన్ ఇచ్చే సంగీతం సైతం సినిమా స్థాయిని పెంచడం ఖాయం అని అంటున్నారు. బాలకృష్ణ సినిమా అంటే తమన్ కి పూనకాలు వస్తాయి. ఆ ఎఫెక్ట్ ఆ మధ్య ఒక థియేటర్‌లో బాక్స్‌లు పగిలి పోయాయి, సౌండ్ విషయంలో థియేటర్ల యాజమాన్యాలు కాస్త చూసి తగ్గించుకుంటున్నారు. అఖండ 2 విషయంలోనూ తమన్ అంతకు మించి డెడికేషన్‌ను కనబర్చుతున్నాడు.
తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్
ఇప్పటికే వచ్చిన టీజర్ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంను చూసే ఉన్నాం. ఇక పాటల కోసం కూడా ఆయన నుంచి అంతకు మించిన మ్యూజిక్ వస్తుందనే విశ్వాసం ఉంది. సెకండ్ హాఫ్ బోయపాటి అద్భుతమైన కాన్సెప్ట్‌ను, సీన్స్‌ను డెవలప్ చేస్తే తమన్ అందుకు తగ్గట్లుగా మ్యూజిక్ ఇస్తే ఇక అభిమానులు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీల్ కావడం ఖాయం. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్ నటిస్తున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌లో నటించిన ప్రగ్జా జైస్వాల్ ఈ సినిమాలో నటిస్తుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్ర విషయంలో దర్శకుడు బోయపాటి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో ఇదో స్పెషల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
