ముంబైలో బాలయ్య.. పాప్స్ తో మామూలు కామెడీ కాదుగా!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు అఖండ-2 తాండవం మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 14 Nov 2025 2:53 PM ISTటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు అఖండ-2 తాండవం మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అఖండ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు. తొలి అడుగు ముంబైలో వేయనున్నారు.
అక్కడ అఖండ-2 ను టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనుండగా.. ఇప్పటికే మ్యూజిక్ తమన్ ఆ పాటపై భారీ హోప్స్ క్రియేట్ చేశారు. కొన్ని రోజుల క్రితం సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టైటిల్ సాంగ్ కోసం అంతా వెయిట్ చేస్తుండగా.. మరికొన్ని గంటల్లో ముంబైలో పాట లాంఛ్ అవ్వనుంది.
అందుకు గాను బాలకృష్ణ ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు. సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్.. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విమానాశ్రయం బయటకు వచ్చాక.. బాలయ్య అక్కడ ఉన్న బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లతో కామెడీ చేశారు.
అనేక మంది పాపరాజీలు ఉండగా.. వారిని చూసి సరదాగా భయపడుతున్నట్లు రెండు అడుగులు వెనక్కి వేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న వ్యక్తి.. షాకవ్వగా.. మళ్లీ ముందుకు నడిచారు. అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య స్పాంటినేయస్ థింగ్ ఫుల్ ఫన్నీగా ఉందని చెబుతున్నారు.
సాధారణంగా పాపరాజీలు.. ఎప్పుడూ సెలబ్రెటీలు వెంట పడుతూనే ఉంటారు. ఎవరైనా కనపడడమే లేటు.. కెమెరాలతో క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు తీస్తుంటారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా కనపడడమే లేటు.. పిక్స్ క్లిక్ మనిపించారు. అప్పుడే బాలయ్య ఫన్నీగా బిహేవ్ చేశారు.
అయితే బాలయ్య అఖండ 1తో బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ అందుకున్నారు. హిందీ డబ్బింగ్ వెర్షన్ ముందు రిలీజ్ అవ్వకపోయినా.. ఆ తర్వాత యూట్యూబ్ లో, శాటిలైట్ ఛానెళ్లలో ఆకట్టుకుంది. దీంతో నటసింహానికి నార్త్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి బాలయ్య సిద్ధమయ్యారు. అఖండ-2 టీమ్ కూడా పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. మరి నార్త్ లో అఖండ సీక్వెల్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
