Begin typing your search above and press return to search.

అఖండ 2 నయా టీజర్: బాలయ్య 'ఉగ్రరూపం' చూశారా!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిస్తే స్క్రీన్ మీద ఎలాంటి విధ్వంసం ఉంటుందో 'అఖండ 2' కొత్త టీజర్ శాంపిల్ చూపించింది.

By:  M Prashanth   |   28 Nov 2025 9:02 PM IST
అఖండ 2 నయా టీజర్: బాలయ్య ఉగ్రరూపం చూశారా!
X

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిస్తే స్క్రీన్ మీద ఎలాంటి విధ్వంసం ఉంటుందో 'అఖండ 2' కొత్త టీజర్ శాంపిల్ చూపించింది. ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా మేకర్స్ ఒక హై వోల్టేజ్ విజువల్ ట్రీట్ ఇచ్చారు. "తాండవం" అనే టైటిల్ కు న్యాయం చేస్తూ, బాలయ్య అఘోరా గెటప్ లో చూపించిన ఉగ్రరూపం చూస్తుంటే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయం అనిపిస్తోంది.




​టీజర్ ఆరంభమే ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైంది. "భారత్ ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డం పెట్టుకునే కొట్టాలి" అంటూ వచ్చే వాయిస్ ఓవర్ సినిమాలోని సీరియస్ నెస్ ను ఎలివేట్ చేసింది. దానికి తోడు కుంభమేళా విజువల్స్, లక్షలాది మంది సాధువుల మధ్య బాలయ్య నడుస్తుంటే.. స్క్రీన్ మొత్తం ఒక డివైన్ వైబ్రేషన్ తో నిండిపోయింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక మాస్ జాతర అని క్లియర్ గా అర్థమవుతోంది.

​ముఖ్యంగా బాలయ్య ఎంట్రీ షాట్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. నీళ్లలో నుంచి త్రిశూలం పట్టుకుని పైకి లేవడం, అగ్నిగుండం నుంచి నడుచుకుంటూ రావడం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ విజువల్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. "శివమ్.. శివమ్.." అంటూ సాగే ఆ సౌండ్ డిజైన్ థియేటర్లో సీట్లు దద్దరిల్లేలా ఉంది.

​ఈసారి బోయపాటి స్కేల్ పెంచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హిమాలయాలు, మిలిటరీ బేస్, టెర్రరిస్టుల గ్యాంగ్.. ఇలా కథను చాలా విశాలంగా చూపించారు. బాలయ్య చెప్పిన డైలాగ్ "కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ.. ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ" అనేది ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉంది.

​యాక్షన్ ఎపిసోడ్స్ లో బాలయ్య ఎనర్జీకి హద్దుల్లేవు. గాల్లోకి లేచి విలన్లను నరకడం, త్రిశూలంతో విలన్లను విసిరికొట్టడం వంటి షాట్స్ మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లాంటివి. మొదటి అఖండ కంటే ఇందులో వయొలెన్స్, ఇంటెన్సిటీ డబుల్ అయినట్లు అర్థమవుతోంది. ధర్మాన్ని రక్షించడానికి వచ్చే శివుడి ఉగ్రరూపంలా బాలయ్య కనిపిస్తున్నారు. ​మొత్తానికి డిసెంబర్ 5న థియేటర్లలో అసలు సిసలైన 'తాండవం' చూడబోతున్నాం అని చెబుతున్నారు. మాస్ గాడ్ బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి కలిసి వండిన ఈ విజువల్ వండర్.. ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.