Begin typing your search above and press return to search.

అఖండ‌2.. బాల‌య్య ఫ్యాన్స్ కు పూన‌కాలు ఖాయం!

అందులో భాగంగానే అఖండ‌2లో ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ 25 నిమిషాల‌కు పైగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Oct 2025 6:00 PM IST
అఖండ‌2.. బాల‌య్య ఫ్యాన్స్ కు పూన‌కాలు ఖాయం!
X

సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ వ‌రుస హిట్ల‌తో ఫుల్ జోష్ మీదున్నారు. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న అఖండ‌2 సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు బాల‌య్య‌. 2021లో రిలీజైన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. అఖండ సినిమాతో బాల‌య్య మాస్ ఇమేజ్ కు కొత్త డైమెన్ష‌న్ ను ఇచ్చిన బోయ‌పాటి అఖండ‌2ను మ‌రింత ఆధ్యాత్మిక, యాక్ష‌న్ ఫ్రేమ్ లో తెర‌కెక్కిస్తున్నారు.

అఖండ‌2 కోసం ఎదురుచూపులు

ఈ నేప‌థ్యంలో అఖండ‌2 గురించి ఇప్పటికే చాలా విష‌యాలు బ‌య‌టికొచ్చి అవ‌న్నీ ఫ్యాన్స్, స‌ద‌రు మూవీ ల‌వ‌ర్స్ ను ఎంత‌గానో ఎగ్జైట్ చేస్తుండగా ఈ సినిమా గురించి ఇప్పుడు మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. అఖండ‌తో పోలిస్తే అఖండ‌2 లో బోయ‌పాటి యాక్ష‌న్ సీక్వెన్స్ ను మ‌రింత భారీగా ప్లాన్ చేశార‌ని మొద‌టి నుంచి చెప్తూనే వ‌స్తున్నారు.

25 నిమిషాల యాక్ష‌న్ సీక్వెన్స్

అందులో భాగంగానే అఖండ‌2లో ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ 25 నిమిషాల‌కు పైగా ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే అఖండ‌2లోని ఆ యాక్ష‌న్ సీక్వెన్స్ ను చూసిన త‌ర్వాత ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఆ యాక్ష‌న్ ఎపిసోడ్ ను 20 నిమిషాల్లోపు ఉండేలా త‌గ్గించ‌మ‌ని రిక్వెస్ట్ చేశార‌ని స‌మాచారం. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే ఒక‌వేళ నిజ‌మైతే మాత్రం బాల‌య్య ఫ్యాన్స్ కు పూన‌కాలు రావ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి.

నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేసిన అఖండ‌2

మామూలుగానే బాల‌య్య‌- బోయ‌పాటి సినిమాల్లో ఎక్కువ యాక్ష‌న్ ఉంటుంది. ఇప్పుడు అఖండ‌2లో బోయ‌పాటి కావాల‌ని నార్త్ ఆడియ‌న్స్ కోసం ఆ యాక్ష‌న్ సీక్వెన్స్ ను మ‌రింత పెంచిన‌ట్టు చెప్తున్నారు కాబ‌ట్టి, ఇక ఇది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. అఖండ‌2లో బాల‌య్య యాక్ష‌న్, పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ ఉండ‌టం ఖాయమ‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌గ్యా జైస్వాల్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విల‌న్ గా న‌టిస్తుండ‌గా, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ లో రామ్ ఆచంట‌, గోపీ ఆచంట అఖండ‌2 ను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 5న అఖండ‌2 ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సారి మేక‌ర్స్ నార్త్ మార్కెట్ పై ఎక్కువ దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.