అఖండ 2.. ఆలస్యం అమృతమే కానీ..?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటేనే సినిమాపై భారీ హైప్ వస్తుంది. సింహా నుంచి అఖండ వరకు బోయపోఅట్ శ్రీని బాలయ్య ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతుంది.
By: Ramesh Boddu | 28 Aug 2025 11:12 AM ISTనందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటేనే సినిమాపై భారీ హైప్ వస్తుంది. సింహా నుంచి అఖండ వరకు బోయపోఅట్ శ్రీని బాలయ్య ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతుంది. ఐతే అఖండ 2 సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ లో ఉన్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచాంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ కి సీక్వెల్ కథ అవునా కాదా అన్నది తెలియదు కానీ ఆ రోల్స్ మాత్రం రిపీట్ అవుతున్నాయి.
అఘోరా పాత్రలో బాలకృష్ణ..
బాలయ్య డ్యుయల్ రోల్ తో మరోసారి సర్ ప్రైజ్ చేయనున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలకృష్ణ మరోసారి అదరగొట్టేస్తారని టాక్. అఖండ 2 సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు. అఖండ 2 అసలైతే సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ చేశారు. ఐతే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. సెప్టెంబర్ దసరా సీజన్ హాలీడేస్ లో పర్ఫెక్ట్ రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా సీజీ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల అది కుదరట్లేదు.
ఇక ఇదిలాఉంటే అఖండ 2 సినిమాను డిసెంబర్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారట. అప్పటివరకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అఖండ 2 సినిమా రషెస్ చూసిన చిత్ర యూనిట్ సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారట. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందని అంటున్నారు. సినిమాలో ఆది పినిశెట్టి విలనిజం కూడా అదరగొట్టేస్తుందట.
డిసెంబర్ లో అఖండ 2..
అంతకుముందు కూడా అఖండ సినిమా డిసెంబర్ లోనే రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అదే డిసెంబర్ కి అఖండ 2 వస్తుంది. మరి అఖండ 2 ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాలో సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రగ్యా జైస్వాల్ కూడా ఉంటుందట. థమన్ మరోసారి అఖండ 2 కోసం వీరంగం ఆడేస్తున్నాడని టాక్. స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు థమన్ మ్యూజిక్ కూడా అఖండ 2 కి హైలెటెడ్ థింగ్ అవుతుందని టాక్.
అఖండ 2 కి బాలయ్య చేయాల్సిన పని అంతా పూర్తైందట. డిసెంబర్ రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ ను చిన్నగా మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అఖండ తో బోయపాటి శ్రీను ఈసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. బాలయ్య మాస్ మేనియా ఎలా ఉంటుందో ఈసారి నేషనల్ వైడ్ గా చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. అఖండ 2 లేట్ అవ్వడం ఆ సినిమాకు కలిసి వస్తుందా లేదా.. ఆలస్యం అమృతమే కాదు విషం కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి మేకర్స్ ఈ సినిమాను ఎలా ప్లాన్ చేస్తున్నారు అన్నది చూడాలి.
