అఖండ2 త్వరపడాల్సిన టైమొచ్చింది
అసలే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ కు మంచి క్రేజ్, డిమాండ్ ఉన్నాయి. పైగా అఖండ సినిమాకు సీక్వెల్ కావడంతో అఖండ2పై భారీ అంచనాలున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 5 Nov 2025 5:00 PM ISTవరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ2 చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ రూపొందుతోంది. అసలే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ కు మంచి క్రేజ్, డిమాండ్ ఉన్నాయి. పైగా అఖండ సినిమాకు సీక్వెల్ కావడంతో అఖండ2పై భారీ అంచనాలున్నాయి.
అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ2
బోయపాటి శ్రీను కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అఖండ2 ను తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికైతే అఖండ2 ఈపాటికే రిలీజవాల్సింది. కానీ షూటింగ్ లో జాప్యం కారణంగా ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రిలీజ్ కు మరో నెల రోజులే టైముంది. అఖండ2 లాంటి భారీ బడ్జెట్ సినిమాకు ఇది చాలా టైమ్.
ఇంకా మొదలవని ప్రమోషన్స్
ఇప్పటికే ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టి ఉండాల్సింది కానీ ఇప్పటివరకు అఖండ2 నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ సినిమా నుంచి కనీసం ఒక్క పాట కూడా రిలీజ్ చేయకపోవడం, ఇంకా ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడం ఫ్యాన్స్ కు ఆందోళనను కలిగిస్తోంది. ఇలాంటి సినిమాలకు ఎప్పుడో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, సినిమాపై బజ్ పెంచాల్సింది కానీ మేకర్స్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయకపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ మూవీ రిలీజ్ కు చాలా తక్కువ టైమే ఉండటంతో మేకర్స్ ఇంకెప్పుడు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటికైనా మేకర్స్ త్వరపడి ప్రమోషన్స్ ను మొదలుపెడతారేమో చూడాలి. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
