Begin typing your search above and press return to search.

సింహానికి వ‌డ‌దెబ్బేంటి బాస్!

ఆన్ సెట్స్ లో బాల‌య్య ఎంత యాక్టిగ్ ఉంటారో ఆయ‌న తో ప‌ని చేసిన వాళ్లు చెబుతుంటారు.

By:  Srikanth Kontham   |   30 Nov 2025 2:00 PM IST
సింహానికి వ‌డ‌దెబ్బేంటి బాస్!
X

ఆన్ సెట్స్ లో బాల‌య్య ఎంత యాక్టిగ్ ఉంటారో ఆయ‌న తో ప‌ని చేసిన వాళ్లు చెబుతుంటారు. స్టార్ అనే ఇమేజ్ ని ప‌క్క‌న బెట్టి ప‌ని చేస్తారు. స‌హ‌చ‌ర న‌టుల‌తో చ‌నువుగా మెలుగుతారు. కాంబినేష‌న్స్ ఉన్నాయంటే? ఎదుట న‌టుల‌కు చిన్న‌పాటి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంటారు. ఇదంతా బాల‌య్య‌తో ప‌ని చేసిన త‌ర్వాత న‌టులు చెప్పే మాట‌. అంత‌కు ముందు మాత్రం బాల‌య్య తో సీన్స్ అంటే చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. ఆయ‌న ముంద‌కెళ్ల‌డానికి కూడా జంకుతారు. సీరియ‌స్ గా ఉంటారు అనే అపోహ‌లున్నాయి. అవ‌న్నీ ఆయ‌న ముందుకెళ్ల‌నంత వ‌ర‌కే.

బాల‌య్య ద‌ర్శ‌కుల హీరో:

వెళ్లిన త‌ర్వాత స్నేహితుడిగా మారిపోతారు. అలాగే బాల‌య్య పూర్తిగా ద‌ర్శ‌కుల హీరో. డైరెక్ట‌ర్ చెప్పింది చేసుకుంటూ వెళ్ల‌డం త‌ప్ప‌! అత‌డి ప‌నిలో మాత్రం కాళ్లు..వేళ్లు పెట్ట‌రు. ఇక బాల‌య్యతో యాక్ష‌న్ స‌న్నివేశాలంటే ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. వాటిలో సైతం వీలైనంత వ‌ర‌కూ రియాల్టీ చూపించే ప్ర‌య‌త్నం చేస్తారు. అందుకోసం బాల‌య్య ఆన్ సెట్స్ లో ఎంతో క‌ష్ట‌ప‌డ‌తారు. ఈ నేప‌థ్యంలో తాజాగా `అఖండ 2` లో ఓ యాక్ష‌న్ స‌న్నివేశంలో బాల‌య్య పాల్గొన్న తీరు తెలిస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. ఈ సినిమాలో ఓ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని ఏకంగా 15 రోజుల పాటు షూట్ చేసారుట‌.

రెండు వారాలు ఎండ‌లోనే:

అదీ వేస‌వి కాలంలో డే షూటింగ్ లో తీవ్ర‌మైన ఎండ ఉన్న‌ప్పుడు. దీంతో చాలా మంది న‌టులు వ‌డ‌దెబ్బ త‌గిలి పడి పోయారుట‌. కానీ బాల‌య్య మాత్రం ఎక్కడా కింగ‌లేదు. ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా ప‌ని చేసారుట‌. అంత ఎండ‌లో కూడా త‌న అసిస్టెంట్ ని గొడుగు కూడా ప‌ట్ట‌నివ్వ‌లేదుట‌. సినిమా ప‌ట్ల త‌న‌కున్న ఫ్యాష‌న్ అలాంటింద‌ని న‌టుడు ఆది తెలప‌డంతోనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బోయ‌పాటి క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య తో సీన్స్ అంటే తాను కూడా భ‌య‌ప‌డిన‌ట్లు తెలిపాడు. బాల‌య్య‌కి స‌మానంగా తాను స‌రిపోతానా? అనే సందేహాన్ని వ్య‌క్తం చేసాడుట‌.

కెరీర్ లో తొలిసారి అలా:

ఆ స‌మ‌యంలో వాళ్లిద్ద‌రి మ‌ధ్య క‌థ కంటే ఎక్కువ డిస్క‌ష‌న్ బాల‌య్య గురించే జ‌రిగింద‌న్నాడు. సినిమాలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌న్నాడు. మంత్ర‌తంత్రాలు చుట్టూ తిరిగే పాత్ర ఇంత వ‌ర‌కూ పోషించ‌లేద‌ని కెరీర్ లో ఇదే తొలిసార‌న్నాడు. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందా? అన్న ఆస‌క్తి త‌న‌లో కూడా ఉంద‌న్నాడు. `అఖండ` కంటే `అఖండ 2` లో రెట్టింపు హై మూవ్ మెంట్స్ ఉంటాయ‌ని ఆది తెలిపాడు.