బాలయ్య 'అఖండ-2'.. మేకర్స్ ఎందుకిలా చేస్తున్నారు?
టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 20 Oct 2025 3:00 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదలవనుంది. సీక్వెల్ ను కూడా బోయపాటి శ్రీనునే తీస్తున్నారు.
అయితే 2021లో కోవిడ్ తర్వాత వచ్చిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత హిందీలో డబ్ చేయగా.. అక్కడ కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అఖండ-2ను ఇప్పుడు బోయపాటి శ్రీను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
యూనివర్సల్ సబ్జెక్ట్ తో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు మించిపోయే రీతిలో సీక్వెల్ ను తీస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు వారిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ హిట్లే.
సింహా, లెజెండ్, అఖండ సూపర్ సక్సెస్ అవ్వగా.. ఇప్పుడు అఖండ 2పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు అఖండ సీక్వెల్ కావడంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి అనుకున్న రేంజ్ లో అప్డేట్స్ రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఫెస్టివల్స్ కు అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫైర్ అవుతున్నారు!
ఇప్పటి వరకు మేకర్స్.. టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కనీసం కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. పాత పోస్టర్ పై రైటప్ మార్చి.. దసరా విషెస్ చెప్పారు. సినిమా వాయిదా పడినప్పుడూ అదే పోస్టర్ యూజ్ చేశారు.
అయితే రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్నా.. సైలెంట్ గా ఉంటున్నారు. ఫస్ట్ సింగిల్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో మేకర్స్ ఎందుకిలా చేస్తున్నారని.. అసలేం జరుగుతోందని డిస్కస్ చేసుకుంటున్నారు. కనీసం ఏదో అప్డేట్ ఇవ్వకుండా.. సైలన్స్ మెయింటైన్ చేయడమేంటని అడుగుతున్నారు. సినిమా పనులు పూర్తి చేస్తూనే.. అప్డేట్స్ తో సందడి చేయాల్సి ఉందని హితవు పలుకుతున్నారు. మరి మేకర్స్ ఇప్పటికైనా కొత్త అప్డేట్ ఇస్తారేమో వేచి చూడాలి.
