Begin typing your search above and press return to search.

అఖండ 2 ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అప్డేట్..!

డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ ఈ ఇయర్ మరో సినిమాతో ఫ్యాన్స్ ని అలరించనున్నారు.

By:  Ramesh Boddu   |   24 Oct 2025 11:04 AM IST
అఖండ 2 ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అప్డేట్..!
X

డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ ఈ ఇయర్ మరో సినిమాతో ఫ్యాన్స్ ని అలరించనున్నారు. అదే అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రగ్యా జైశ్వాల్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఐతే అఖండ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ లో అలరించారు. అఖండ 2 లో కూడా డ్యుయల్ రోల్ ఉంటుందని తెలుస్తుంది.. ఐతే ఆల్రెడీ అఖండ 2లో అఘోరి లుక్ తో ఒక టీజర్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.

హిందూపురం ఎమ్మెల్యే మురళి కృష్ణ రోల్..

ఇక నెక్స్ట్ బాలయ్య రెండో రోల్ ఏంటన్నది ఇప్పటివరకు రివీల్ కాలేదు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖండ 2 తాండవం సినిమాలో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే మురళి కృష్ణ రోల్ లో కనిపిస్తారట. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ శనివారం రిలీజ్ చేస్తారని టాక్. అఖండ 2 సినిమా నేషనల్ వైడ్ ఆడియన్స్ ని మెప్పించేలా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకున్నారట బోయపాటి శ్రీను.

ఆల్రెడీ బోయపాటి తీసిన సరైనోడు, జయ జానకి నాయక సినిమాలకు హిందీ డబ్బింగ్ వెర్షన్ లో కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. సో అఖండ కు ఆల్రెడీ పాన్ ఇండియా బజ్ వచ్చింది కాబట్టి ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 సినిమా బాక్సాఫీస్ తాండవం చేస్తుందని అంచనా వేస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ ఇద్దరి కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. డిసెంబర్ లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా గురించి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

అఖండ 2 సినిమాకు డివోషనల్ టచ్..

బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమాలో బాలయ్య ఉగ్రరూపం చూపిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అదే తరహాలో అఖండ 2 సినిమాకు డివోషనల్ టచ్ కూడా ఉంది కాబట్టి సినిమా కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో రీచింగ్ ఉండబోతుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా అఖండ తరహాలోనే అఖండ 2 కి కూడా ఎక్కడ తగ్గట్లేదని అంటున్నారు.

అఖండ 2 తాండవం సినిమా హిందీ బిజినెస్ కూడా బాగుందని తెలుస్తుంది. ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో బాలయ్య అదరగొట్టేస్తాడని అంటున్నారు. బోయపాటి సినిమాలో బాలయ్య యాక్షన్ ఫోర్స్ తెలుగు ఆడియన్స్ కు తెలుసు కానీ ఈసారి నేషనల్ లెవెల్ లో అదే హిందీ ఆడియన్స్ కి కూడా ఆ మాస్ కిక్ ఇవ్వనున్నారు బోయపాటి.