Begin typing your search above and press return to search.

బాల‌య్య 111వ సినిమా రేసులో ఇద్ద‌రు భామ‌లా?

నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి గర్జించడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ఇప్పటికే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   19 March 2026 6:00 AM IST
బాల‌య్య 111వ సినిమా రేసులో ఇద్ద‌రు భామ‌లా?
X

నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి గర్జించడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ఇప్పటికే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. దీంతో నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర యూనిట్ ప్రస్తుతం ఇద్దరు అగ్ర కథానాయికలు నయనతార , అనుష్క శెట్టిల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. లేడీ సూపర్ స్టార్ నయనతారకు బాలయ్యతో నటించిన మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `సింహా`, `శ్రీరామరాజ్యం`, `జై సింహా` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు నయనతార క్లాస్ అండ్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తోడైతే స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గోపీచంద్ మలినేని సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా నయనతార వంటి అనుభవజ్ఞురాలైన నటి అయితే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు స్వీటీ అనుష్క శెట్టి పేరు కూడా ఈ రేసులో బలంగా వినిపిస్తోంది.

అనుష్క ఇప్పటి వరకు బాలకృష్ణ సరసన ఒక్క సినిమాలో కూడా నటించలేదు. వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోవాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అనుష్కకు ఉన్న క్రేజ్ , రాజసం బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీకి సరైన జోడీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఫ్రెష్ కాంబినేషన్ సెట్ అయితే సినిమాపై ఉండే హైప్ రెట్టింపు అవుతుంది. నయనతార -అనుష్క ఇద్దరూ కూడా సీనియర్ హీరోల పక్కన ఒదిగిపోయే ప్రతిభ గలవారే. నయనతారతో ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ అయితే హిట్ గ్యారెంటీ అని ఒక వర్గం గ‌ట్టిగా న‌మ్ముతుంది.

అనుష్కతో సరికొత్త కాంబినేషన్ సెట్ చేసి ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమా ఓ పవర్‌ఫుల్ మాస్ డ్రామా. ఇలాంటి కథల్లో హీరోయిన్ పాత్రకు కేవలం పాటలకే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే బలం ఉండాలి. నయనతార గ్లామర్ , సీరియస్ రోల్స్‌లో రాణించగలదు. అలాగే అనుష్క కూడా అటు గ్లామర్, ఇటు పెర్ఫార్మెన్స్‌లో మేటి. వీరిద్దరిలో ఎవరు ఫైనల్ అయినా అది బాలయ్య కెరీర్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం డేట్స్ - రెమ్యునరేషన్ వంటి విషయాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నయనతార సెంటిమెంటా? లేక అనుష్కతో సరికొత్త ప్రయోగమా? అన్నది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిం చాల్సి ఉంది. ఎవరిని తీసుకున్నా బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ఒకవేళ అనుష్క ఫైనల్ అయితే మాత్రం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ పట్టాలెక్కినట్లే. మరి ఈ ఇద్దరు భామల్లో బాలయ్య తో ఛాన్స్ ఎవ‌రందుకుంటారు? అన్న‌ది చూడాలి.