దేవసేన ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్ ఖుషీ!
సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉంటున్న అనుష్కను ఇలా సడన్‌గా స్క్రీన్‌పై చూసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
By: Madhu Reddy | 26 Jun 2026 10:51 AM ISTబాహుబలి ‘దేవసేన’ గుర్తుందిగా? మన స్వీటీ అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'బాహుబలి: ది టార్చ్ బేరర్' డాక్యుమెంటరీ కోసం ఆమె ప్రభాస్, రానాతో కలిసి సందడి చేసింది. సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉంటున్న అనుష్కను ఇలా సడన్‌గా స్క్రీన్‌పై చూసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మన క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి సందడి:
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమా 'బాహుబలి'. రాజమౌళి చెక్కిన ఈ అద్భుత దృశ్యకావ్యం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతో 'బాహుబలి: ది టార్చ్ బేరర్' అనే స్పెషల్ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీని ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ వదిలిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఒకే ఫ్రేమ్‌లో ప్రభాస్, అనుష్క, రానా:
చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్, అనుష్క, రానా ముగ్గురూ ఒకే చోట కూర్చొని ముచ్చట్లు పెట్టడం ఫ్యాన్స్‌కు కంటి నిండా నవ్వును తెచ్చింది. ఇక పాత రోజులను గుర్తుచేసుకుంటూ వీరు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అందరి దృష్టి అనుష్క పైనే పడింది. ఎందుకంటే 'ఘాటి' సినిమా తర్వాత ఆమె ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఇలా మెరవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
స్వీటీ నవ్వితే షూటింగ్ బంద్:
ఈ వీడియోలో ప్రభాస్ మన స్వీటీ (అనుష్క) గురించి ఒక గమ్మత్తైన సీక్రెట్ లీక్ చేశాడు. 'అనుష్క ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే.. అరగంట పైనే నవ్వుతుంది' అందుకే ఆమె రోజు సెట్స్‌కి వచ్చేటప్పుడు.. ఈరోజు ఎలాగైనా నవ్వకూడదు అని గట్టిగా అనుకుని వచ్చేది. ఎందుకంటే తను నవ్వితే షూటింగ్ ఆగిపోతుంది, దానివల్ల అంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం వస్తుందని భయపడేది" అంటూ ప్రభాస్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఎప్పటికీ మా క్వీన్ నువ్వే:
అరుంధతి, భాగమతి, బాహుబలి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అనుష్క. ఇక ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నటనకు సాటిలేదు. అందుకే సోషల్ మీడియాలో అభిమానులు "దేవసేన ఎప్పటికీ మా క్వీన్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్, అనుష్కల కాంబినేషన్‌ను మళ్లీ ఇలా చూడటం నిజంగా ఒక బ్యూటిఫుల్ మెమొరీ అని మురిసిపోతున్నారు.
ఏదేమైనా, బాహుబలి మ్యాజిక్ థియేటర్లలోనే కాదు, ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలో కూడా అస్సలు తగ్గలేదని నిరూపితమైంది. ప్రభాస్, రానా, అనుష్కల ఫ్రెండ్‌షిప్ బాండ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇక దేవసేన మళ్లీ కెమెరా ముందుకు రావడం, ఆ పాత జ్ఞాపకాలను పంచుకోవడం నిజంగానే టాలీవుడ్ మూవీ లవర్స్‌కు ఒక పెద్ద సర్ప్రైజ్ అండ్ ట్రీట్ అని చెప్పవచ్చు..
