Begin typing your search above and press return to search.

బాహుబలి, పుష్ప మధ్య కంపేరిజన్.. వడ్డే నవీన్ ఒపీనియన్ ఏంటి?

ట్రాన్స్‌ ఫర్ త్రిమూర్తులు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   12 Jun 2026 12:00 AM IST
బాహుబలి, పుష్ప మధ్య కంపేరిజన్.. వడ్డే నవీన్ ఒపీనియన్ ఏంటి?
X

ట్రాన్స్‌ ఫర్ త్రిమూర్తులు సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాహుబలి, పుష్ప సినిమాల విజయాలు పోల్చుతూ షేర్ చేసుకున్న అభిప్రాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు చేరుకోవడంపై మాట్లాడిన వడ్డే నవీన్.. "బాహుబలి సక్సెస్ కొంతవరకు ఊహించిందే" అని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాలో భారీ స్కేల్, అద్భుతమైన విజువల్స్, ఎక్స్టెన్సివ్ స్టోరీ ఉన్నాయని, అలాంటి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభావం చూపుతుందని ముందే అంచనా వేయవచ్చని తెలిపారు. మొదటి నుంచి బాహుబలిపై భారీ అంచనాలు ఉండటం కూడా దాని విజయానికి మరో కారణమని చెప్పారు.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "పుష్ప సాధించిన సెన్సేషన్ నిజంగా ఊహించనిది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది" అని అన్నారు. ఒక మాస్ క్యారెక్టర్, సింపుల్ కథతో వచ్చిన సినిమా ఆ స్థాయిలో నేషనల్ వైడ్ గా ప్రభావం చూపడం ప్రత్యేకమని పేర్కొన్నారు.

గత పదేళ్లలో అల్లు అర్జున్ డెవలెప్మెంట్ అద్భుతమని వడ్డే నవీన్ ప్రశంసించారు. పుష్ప తర్వాత ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన గుర్తింపు మామూలుది కాదని చెప్పారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చూపించిన మేనరిజమ్స్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. అలాగే సినిమాలోని పాటలు, డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా పుష్ప విజయానికి మెయిన్ రీజన్స్ లో ఒకటని చెప్పారు.

ముఖ్యంగా యూత్ ఆ రోల్ ను ఇమిటేట్ చేయడం, రీల్స్ రూపంలో ఇండియా వైడ్ గా ట్రెండ్ కావడం వల్ల అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరిగిందన్నారు. అయితే వడ్డే నవీన్ కామెంట్స్ చూస్తే.. ఆయన దృష్టిలో బాహుబలి విజయం భారీ కాన్వాస్, విజువల్ గ్రాండియర్ కారణంగా ముందే ఊహించినది. కానీ పుష్ప విజయం మాత్రం పూర్తిగా అన్ ఎక్స్పెక్టెడ్. కేవలం కంటెంట్, క్యాస్టింగ్ స్ట్రెంత్, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్‌ తో నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించిందనేది ఆయన ఫీలింగ్.

ఇక చాలా కాలం తర్వాత ట్రాన్స్‌ ఫర్ త్రిమూర్తులుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వడ్డే నవీన్.. ఆ సినిమా కోసం ఎంత ఎనర్జీతో పనిచేశానో, అదే ఉత్సాహంతో ప్రమోషన్లు చేస్తున్నానని తెలిపారు. జూన్ 19న విడుదల కానున్న ఆ చిత్రంతో తనకు మరో మంచి స్టార్టింగ్ దక్కుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనా బాహుబలి మూవీ సక్సెస్ ఊహించిందే.. పుష్ప విజయం మాత్రం ఊహించనిదంటూ వడ్డే నవీన్ చేసిన కంపేరిజన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.