Begin typing your search above and press return to search.

‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుసిరీస్ రిలీజ్ డేట్ లాక్.. ఆ క్షణం ఎప్పుడంటే?

ఈ సినిమా తెరవెనుక జరిగిన అద్భుతమైన ప్రయాణాన్ని చూపిస్తూ ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ పేరుతో ఒక ప్రత్యేక డాక్యుసిరీస్‌ను సిద్ధం చేశారు. ఇది 2026 జూన్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ వివరాలు చూద్దాం..

By:  Madhu Reddy   |   21 Jun 2026 3:53 PM IST
‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుసిరీస్ రిలీజ్ డేట్ లాక్.. ఆ క్షణం ఎప్పుడంటే?
X

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా జెండాను ఎగరేసిన విజువల్ వండర్ ‘బాహుబలి’ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని జనం ఎదురుచూస్తున్న తరుణంలో మేకర్స్ ఒక క్రేజీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా తెరవెనుక జరిగిన అద్భుతమైన ప్రయాణాన్ని చూపిస్తూ ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ పేరుతో ఒక ప్రత్యేక డాక్యుసిరీస్‌ను సిద్ధం చేశారు. ఇది 2026 జూన్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ వివరాలు చూద్దాం..




సినిమా కాదు.. సినిమాను మించిన సాహసం:

ఈ ‘ది టార్చ్ బేరర్’ అనేది మామూలు సినిమా కాదు. ఎస్.ఎస్. రాజమౌళి విజన్‌తో మొదలైన ఈ ట్రెండ్ సెట్టర్ సినిమా వెనుక జరిగిన అసలు కథ ఇది. ఇక అసలు ఈ మహాయజ్ఞం ఎలా ఊపిరి పోసుకుంది, ఎన్నెన్ని అడ్డంకులను దాటుకుని ఈ స్థాయికి చేరింది అనే ఆసక్తికరమైన విషయాలను, తెరవెనుక సాహసాలను ఇందులో పక్కాగా చూపించబోతున్నారు.

నటీనటులు, టెక్నీషియన్ల రాత్రింబవళ్ల శ్రమ:

రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ తమ తమ క్యారెక్టర్ల కోసం పడ్డ కష్టాలు, వేల మంది టెక్నీషియన్ల అలుపెరగని శ్రమను ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. ఇక ముఖ్యంగా ఆ భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, అబ్బురపరిచే వీఎఫ్ఎక్స్ వర్క్ వెనుక ఉన్న అసలు రహస్యాలు, ఆడియన్స్‌కు తెలియని ఎన్నో ఆసక్తికరమైన కథలు ఇందులో బయటపెట్టబోతున్నారు.

జూన్ 26 కోసం ప్రభాస్, జక్కన్న ఫ్యాన్స్ వెయిటింగ్:

బాహుబలి చిత్రం రిలీజైన తర్వాత గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, బాక్సాఫీస్ రికార్డులను ఎలా తిరగరాసింది, మన సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపింది అనే విషయాలను కూడా ఈ డాక్యుసిరీస్‌లో పొందుపరిచారు. ఇక ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రభాస్, రాజమౌళి అభిమానుల్లో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. సోషల్ మీడియాలో ‘జూన్ 26 కోసం వెయిటింగ్’ అంటూ ఫ్యాన్స్ ఇప్పుడే ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.

మొత్తానికి బాహుబలి విడుదలై ఇన్నేళ్లవుతున్నా ఆ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు, ఆ సినిమా ఎలా తీశారో చూపించే ఈ డాక్యుసిరీస్ కచ్చితంగా అంతకుమించిన సరికొత్త థ్రిల్‌ను ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇక మరి ఈ జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న రాజమౌళి ‘టాప్ సీక్రెట్స్’ ఎలా ఉంటాయో చూడాలి.