Begin typing your search above and press return to search.

రీల్స్‌తోనే సినీ ఛాన్స్… ‘ఇరుముడి’లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీ నక్షత్ర కథ

ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న నక్షత్రకు చిన్నతనం నుంచే నటన అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో సరదాగా రీల్స్ చేసే ఈ చిన్నారి వీడియోలు డైరెక్టర్ శివ నిర్వాణ కంట పడ్డాయి.

By:  Madhu Reddy   |   21 Aug 2026 12:21 PM IST
రీల్స్‌తోనే సినీ ఛాన్స్… ‘ఇరుముడి’లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీ నక్షత్ర కథ
X

సోషల్ మీడియా రీల్స్ జీవితాలను ఎలా మారుస్తాయో చెప్పడానికి ఈ క్యూట్ పాప కథే ఒక ఉదాహరణ. మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఇది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామ ఇందులో ఒక కీలకమైన చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కేరళకు చెందిన బేబీ నక్షత్ర. సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్స్ చూసి డైరెక్టర్ స్వయంగా ఈ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారుట.

ఇన్‌స్టా రీల్స్ తెచ్చిన బిగ్ ఆఫర్:

ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న నక్షత్రకు చిన్నతనం నుంచే నటన అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో సరదాగా రీల్స్ చేసే ఈ చిన్నారి వీడియోలు డైరెక్టర్ శివ నిర్వాణ కంట పడ్డాయి. ఇక నక్షత్ర ఎక్స్‌ప్రెషన్స్ నచ్చడంతో వెంటనే ఆమె అమ్మగారిని సంప్రదించి, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. ఇప్పటివరకు సౌత్ భాషల్లో ఆరు సినిమాలు చేసినా, తెలుగులో మాత్రం ఇదే ఆమెకి గ్రాండ్ డెబ్యూ.

రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ల కూతురిగా :

ఈ సినిమాలో నక్షత్ర ‘మణికంఠ’ అనే పాత్రలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ ల కూతురిగా కనిపించబోతోంది. షూటింగ్ సమయంలో రవితేజ గారితో వర్క్ చేయడం చాలా సరదాగా గడిచిందని, ఆయన తనతో చాలా ఫ్రెండ్లీగా మెలిగారని చెప్పింది. చిన్నప్పటి నుంచి రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటి హీరో పక్కన నటించడం మరచిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేసింది.

సొంతంగా డబ్బింగ్.. సీలేరు అందాలు:

తెలుగు సరిగ్గా రాకపోయినా, భాషను అర్థం చేసుకుని తన పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సీలేరు పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఇక అక్కడ వాతావరణం, ప్రకృతి అందాలు చూస్తుంటే తన సొంత ఊరైన కేరళనే గుర్తుకు వచ్చిందని నక్షత్ర ఓ సందర్భం లో తెలిపింది.

మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్‌లో తొలి రోల్‌లోనే అదరగొట్టిన బేబీ నక్షత్రకు అమ్మ, టీచర్స్ అందించిన సపోర్ట్ ఎంతో ఉంది. రీల్స్ ద్వారా వెలుగులోకి వచ్చి, డబ్బింగ్ కూడా చెప్పి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిన్నారి, ఈరోజు ఆగష్టు 21న రిలీజ్ అవుతున్న ‘ఇరుముడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి..