డాడ్ ప్రెండ్ ప్రోత్సాహంతో హీరోయిన్ గా!
మాలీవుడ్ బ్యూటీ మమితా బైజు టాలీవుడ్ లో సినిమాలు చేయకముందే యువతలో ఫాలోయింగ్ సంపాదించిన బ్యూటీ.
By: Srikanth Kontham | 31 Oct 2025 2:00 PM ISTమాలీవుడ్ బ్యూటీ మమితా బైజు టాలీవుడ్ లో సినిమాలు చేయకముందే యువతలో ఫాలోయింగ్ సంపాదించిన బ్యూటీ. మాలీవుడ్ అనువాద చిత్రం `ప్రేమలు`తోనే బోలెడంత ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి అమ్మడికి యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల రిలీజ్ అయిన `డ్యూడ్ ` తోనూ మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో అమ్మడు ప్రదీప్ రంగనాధ్ కు జోడీగా నటించి మెప్పించింది. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరింది. తమిళ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మరధం పట్టడంతో ఇంత పెద్ద విజయం సాధ్యమైంది.
డాక్టర్ కాబోయి యాక్టర్:
దీంతో మమిత పేరు మరోసారి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది. ఇక తెలుగు లో అవకాశాలు రావడం పెద్ద విషయం కాదు. ఇప్పటికే కొన్ని అవకాశాలు కూడా వచ్చినా రిజెక్ట్ చేసింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే పోషించాలి అనే కండీషన్ తో పని చేస్తుంది. ఈ నేపథ్యంలో గ్లామర్ పాత్రల్లో నటించే అవకాశాలను మమిత రిజెక్ట్ చేసినట్లు ప్రచారంలో ఉంది. అయితే ఈ బ్యూటీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మమితా బైజు తండ్రి డాక్టర్. సొంతంగా ఓ క్లినిక్ కూడా ఉంది.
బేబి డాక్టర్ గా ఫేమస్:
మమిత క్లినిక్ కి వెళ్లిన సమయంలో బేబి డాక్టర్ అని పిలిచేవారట. రోగం నయం అయిన తర్వాత పేషెంట్లు తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన వారిని చూసి ఓ కుమార్తెగా తానెంతో గర్వపడేదాన్ని అన్నారు. ఆ కారణంతో తాను కూడా తండ్రిలా డాక్టర్ అవ్వాలని కలలు కనేదట. కానీ అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో ఆ కల చెదిరి పోయిందంది. 9వ తరగతి చదువుకుంటోన్న సమయంలో `సర్వోపరి బాలక్కాన్` సినిమాలో నటించే అవకాశం వచ్చిందిట. ఆ చిత్రాన్ని నిర్మించేది కూడా తండ్రి స్నేహితుడు కావడంతో అవకాశం ఈజీగా వచ్చిందంది.
నటిగా అమ్మడి ప్రయాణమలా:
ఆ సినిమా తర్వాత ఆడిషన్ కు వెళ్లమని ప్రోత్సహించేవారుట. అలా వెళ్లడం సహా తొలి సినిమా రిలీజ్ అనంతరం చాలా అవకాశాలు వచ్చాయంది. అలా నెమ్మదిగా నటన అలవాటుగా మారిందంది. నటనంటే చిరాకు పడే మమితా నటనపై ఇష్టం పెంచుకున్నట్లు తెలిపింది. కాలక్రమంలో మ్యాకప్ అలవాటు గా మారడంతో ఇంట్లో ఉన్న సమ యంలో కూడా అప్పుడప్పుడు మ్యాకప్ వేసుకునేదట. అప్పటి నుంచి నటిగా స్థిరపడాలి అనే ఆలోచనతోనే ప్రయాణం మొదలు పెట్టినట్లు తెలిపింది. ఈ బ్యూటీ ఇప్పటి వరకూ మాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. తమిళ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న `జన నాయగన్` లోనూ నటిస్తోంది.
