Begin typing your search above and press return to search.

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

‘కాఫీ విత్ కరణ్’లో అనన్య పాండే పాల్గొన్న ఎపిసోడ్ నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ పాత వీడియో మరోసారి వైరల్ అవుతోంది. బాలీవుడ్‌లో నెపోటిజంపై అతడు ఆవేదన వ్యక్తం చేసినట్లు నెటిజన్లు చర్చిస్తున్నారు. అయితే వీడియో వెనుక అసలు సందర్భం స్పష్టంగా లేకపోవడంతో ఈ ప్రచారంపై ఊహాగానాలే కొనసాగుతున్నాయి.

By:  Sivaji Kontham   |   19 Nov 2026 1:38 PM IST
నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!
X

రంగుల ప్ర‌పంచంలో.. అందునా హిందీ సినీప‌రిశ్ర‌మ‌లో ఆర్టిస్టుల జీవితాల్లో వింత‌లు విశేషాలు ఊహించ‌న‌న్ని వెలుగు చూస్తుంటాయి. మ‌ఖ్యంగా అక్క‌డ ఇన్‌సైడ‌ర్ వ‌ర్సెస్ ఔట్ సైడ‌ర్ డిబేట్ ఎప్పుడూ ఉత్కంఠ రేకెత్తిస్తూనే ఉంటుంది. బ‌య‌టి నుంచి వ‌చ్చి ప్ర‌తిభ‌తో ఎదిగే యువ‌హీరోలకు టాలీవుడ్ లో అగ్ర హీరోలు వెన్నుద‌న్నుగా నిలుస్తుంటే, అందుకు భిన్న‌మైన వాతావ‌ర‌ణం బాలీవుడ్ లో ఉంది. అక్క‌డ కొంద‌రు అగ్ర నిర్మాత‌లు, అగ్ర హీరోలు సిండికేట్ గా మారి కొత్త‌వాళ్ల‌ను, బ‌య‌టి నుంచి వ‌చ్చే ప్ర‌తిభ‌ను తొక్కేస్తున్నార‌నే తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. న‌ట‌వార‌సుల కోసం కొంద‌రిని బ‌లి పెడ‌తార‌నే విమ‌ర్శ‌లున్నాయి. కంగ‌న, తాప్సీ లాంటి సీనియ‌ర్ న‌టీమ‌ణులు ప‌లు సంద‌ర్భాల్లో దీనిని ప్ర‌స్థావించి ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు.

క‌ర‌ణ్ జోహార్ ని కంగ‌న నేరుగానే ఢీకొడుతుంటారు. ఆలియా, అన‌న్య పాండే, జాన్వీ లాంటి న‌ట‌వార‌సురాళ్ల కోసం ఇత‌రుల‌ను త‌గ్గిస్తాడ‌ని కూడా క‌ర‌ణ్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఔట్ సైడ‌ర్ ప్ర‌తిభావంతుడి వార‌సుడే క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న వీడియోను ప‌దే ప‌దే రెడ్డిట‌ర్లు స‌హా నెటిజ‌నులు వైర‌ల్ చేస్తూనే ఉన్నారు.

అనన్య పాండే `కాఫీ విత్ కరణ్` తాజా ఎపిసోడ్ చూసిన తర్వాతే బాబిల్ ఖాన్ ఎమోష‌న‌ల్ అయిన‌ వీడియో ఇది అంటూ ఒక త్రోబ్యాక్ వీడియోపై పెద్ద చ‌ర్చ సాగుతోంది. కాఫీ ఎపిసోడ్ చూసాకే వీడియోలోని అసలు అర్థం బోధపడుతోందంటూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ రెడ్డిట్ కమ్యూనిటీలో కొత్త చర్చకు తెరలేపింది. అత‌డు ఆ వీడియోలో బాలీవుడ్ లో అడుగుపెట్టే న‌ట‌వార‌సుల కార‌ణంగా త‌న లాంటి వారికి అవ‌కాశాలు ఉండ‌వ‌ని ఆవేద‌న చెందుతూ క‌నిపింఆడు. అన‌న్య పాండే, అర్జున్ క‌పూర్, సిద్ధాంత్ చ‌తుర్వేది స‌హా కొంద‌రి పేర్ల‌ను ప్ర‌స్తావించాడు. షేర్ చేసిన క్లిప్‌లో అసలేం జరిగిందో స్పష్టంగా కనిపించకపోవడం... క‌న్ క్లూజ‌న్ లేక‌పోవ‌డంతో కేవలం అభిప్రాయాలు, ఊహాగానాల ఆధారంగానే ఈ పోస్ట్ ఉండటంతో నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. వీడియోలో అసలు సందర్భం ఏమిటో చెప్పాలంటూ పలువురు నెటిజ‌నులు కామెంట్ సెక్షన్‌లో ప్రశ్నిస్తున్నారు.

ఈ పోస్ట్‌పై కామెంట్లలో భిన్నాభిప్రాయాలు, గాసిప్‌లు కనిపించాయి. వీడియోలో బాబిల్ పదేపదే తిట్టుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు మాత్రమే ఉందని.. క‌న్నీళ్లు క‌నిపిస్తున్నాయ‌ని.. అయితే దీనికి అసలు కారణం ఏంటో చెప్పాలని ఒక నెటిజ‌న్ కోరారు. మరోవైపు ఈ ఎపిసోడ్ తర్వాత బాబిల్ కొత్త ప్రాజెక్టులేవీ కనిపించడం లేదని.. అతడి వికీపీడియాలోనూ త‌దుప‌రి సినిమాల జాబితా లేదంటూ కొందరు కెరీర్‌పై ఊహాగానాలు సాగిస్తున్నారు. ఇంకొందరు ఈ చర్చను గాసిప్ గా చూడాల‌ని సూచిస్తూ.. ఇదంతా బాలీవుడ్ ఇన్‌సైడ్ చర్చల్లో భాగమేనన్నట్లుగా స్పందించారు. న‌ట‌వార‌సుల కార‌ణంగానే అంద‌రికీ అవ‌కాశాలు పోవు. కొన్నిసార్లు ప్ర‌తిభ‌కు గుర్తింపు ద‌క్కుతోంది. కానీ బాబిల్ ఖాన్ కి న‌ట‌వార‌సుల నుంచి ఎలాంటి పోటీ ఎదురైందో స్ప‌ష్ఠంగా చెప్పాల్సి ఉంటుంది.

ఈ రెడ్డిట్ థ్రెడ్‌లో ఆ వీడియో దృశ్యాలు గానీ..`కాఫీ విత్ కరణ్`లో ఏవైనా ప‌ర్టిక్యుల‌ర్ కామెంట్లు వ‌గైరా కార‌ణాలు కానీ.. స్ప‌ష్ఠంగా లేకపోవడంతో ఈ చర్చ పూర్తిగా నెటిజన్ల అంచనాలు, రూమర్ల చుట్టూనే తిరుగుతోంది. అయితే ఇలాంటి పాపుల‌ర్ టాక్ షో ఎపిసోడ్లు ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు పాత క్లిప్ ల‌ను సోషల్ మీడియాలో ఇలా ముడిపెడుతూ కొత్తగా విశ్లేషించడం రొటీన్‌గా మారింది. ప్ర‌తిదీ తాజా వీడియో కాక‌పోవ‌చ్చు. కానీ త్రోబ్యాక్ వీడియోల‌ను సంద‌ర్భోచితంగా జోడిస్తూ సామాజిక మాధ్య‌మాల‌లో డిబేట్లు పెడుతుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.