Begin typing your search above and press return to search.

బాహుబలి ది ఎపిక్.. రిలీజ్ ప్లాన్ ఎలా ఉందంటే?

ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్, డాల్బీ విజన్, 4 డీఎక్స్, డీ- బాక్స్, ఎపిక్ వంటి ప్రీమియం పెద్ద ఫార్మాట్‌ లలో విడుదల కానున్న స్పెషల్ బాహుబలి ఎడిషన్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   7 Oct 2025 1:20 PM IST
బాహుబలి ది ఎపిక్.. రిలీజ్ ప్లాన్ ఎలా ఉందంటే?
X

పాన్ ఇండియా సెన్సేషన్‌ గా నిలిచి.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి మూవీ.. విడుదలై పదేళ్లు పూర్తవుతున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇప్పుడు రెండు పార్టులు కలిపి రూపొందించిన స్పెషల్ ఎడిషన్ బాహుబలి: ది ఎపిక్.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 31వ తేదీన థియేటర్స్ లో సందడి చేయనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్, డాల్బీ విజన్, 4 డీఎక్స్, డీ- బాక్స్, ఎపిక్ వంటి ప్రీమియం పెద్ద ఫార్మాట్‌ లలో విడుదల కానున్న స్పెషల్ బాహుబలి ఎడిషన్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమా రన్ టైమ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

తాజాగా ఆ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ.. ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. బాహుబలి ది ఎపిక్ తో ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు కొన్ని సీన్లు, సాంగ్స్, ట్రాన్సిషన్లను కట్ చేశామని చెప్పారు. కథను మరింత కాంపాక్ట్‌ గా, ఫ్లో తప్పకుండా సాగేలా రివ్యూ చేసుకున్నామని అన్నారు.

సినిమా మొత్తం 3 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు నడుస్తుందని వివరించారు. సినిమాలో మొదటి భాగంగా ది బిగినింగ్ తర్వాత రెండో భాగంగా ది కన్‌ క్లూజన్ సాగనుందని అన్నారు. అయితే రెండు భాగాలు కలిపే సందర్బంలో, 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అన్న పాయింట్ ఇంటర్వెల్ లో ఉంటుందని తెలిపారు.

అయితే అభిమానులకు ఈ సినిమా రన్‌ టైమ్ పెద్ద సమస్య కాదని శోభు యార్లగడ్డ పేర్కొన్నారు. అదే సమయంలో రీ రిలీజ్ ద్వారా వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ కలెక్షన్స్ ఆశిస్తున్నారని అడగ్గా.. ఎపిక్ వెర్షన్ రిలీజ్ కలెక్షన్లు కోసం కాదని, ఓ సెలబ్రేషన్ అని తెలిపారు. బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలా జరుపుతున్నామని అన్నారు.

ప్రేక్షకులకు గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేశామని పేర్కొన్నారు. అదే సమయంలో బాహుబలి ది ఎపిక్ లో సర్ప్రైజ్ తప్పకుండా ఉంటుందని చెప్పిన శోభు.. అది బాహుబలి 3కు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. బాహుబలి 3పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఇంకా సమయం పడుతుందని తెలిపారు.