Begin typing your search above and press return to search.

'బాహుబలి' కోసం మళ్లీ కలిశారు.. జక్కన్న, ప్రభాస్, రానా చెప్పిన సీక్రెట్స్!

రాజమౌళి వంతు వచ్చినప్పుడు, ఆయన యాక్షన్ గురించి కాకుండా అనుష్క (స్వీటీ) గురించి మాట్లాడటం విశేషం. "నాకు ఆశ్చర్యం కలిగించిన మూమెంట్ అనుష్క ఎంట్రీ.

By:  M Prashanth   |   27 Oct 2025 8:25 PM IST
బాహుబలి కోసం మళ్లీ కలిశారు.. జక్కన్న, ప్రభాస్, రానా చెప్పిన సీక్రెట్స్!
X

ఇదొక అన్‌బిలీవబుల్ మూమెంట్. ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు (SSMB29) సినిమా పనుల్లో ఫుల్ బిజీ. ప్రభాస్ తన పాన్ ఇండియా లైనప్‌తో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. రానా కూడా ఎప్పటిలానే ప్రయోగలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో, ఏళ్ల తర్వాత, 'బాహుబలి' టీమ్ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించింది. ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి కూర్చుని ఆ నాటి మ్యాజికల్ మూమెంట్స్‌ను గుర్తు చేసుకున్నారు.

వీళ్లు కలవడానికి కారణం, 'బాహుబలి: ది ఎపిక్'. 'బాహుబలి' రెండు భాగాలను కలిపి ఒక సినిమాగా మార్చి అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేశాడు. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు" అనేది ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ట్విస్ట్. అయితే, ఆ సీన్ గురించి రాజమౌళి మాట్లాడుతూ, "కట్టప్ప బాహుబలిని చంపిన క్షణం కంటే.. చంపడానికి రెడీ అవుతున్న క్షణం నన్ను చాలా స్టక్ చేసింది" అని చెప్పాడు. ఆ బిల్డప్, ఆ ఎమోషన్ తన మైండ్‌లో బలంగా రిజిస్టర్ అయిపోయిందని అన్నాడు.

ఇక ప్రభాస్ ఆ సినిమా స్కేల్ గురించి మాట్లాడాడు. ముఖ్యంగా తన భారీ విగ్రహాన్ని నిలబెట్టే సీన్ గురించి చెబుతూ, "ఆ విగ్రహాన్ని పైకి లేపడానికి ఇండియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ క్రేన్లు వాడారు. కానీ, ఆ విగ్రహం బరువుకు ఆ క్రేన్లే 'హై షేక్' అయ్యాయి" అని, అప్పుడే తాము ఎంత పెద్ద సినిమా తీస్తున్నామో అర్థమైందని చెప్పాడు.

రాజమౌళి వంతు వచ్చినప్పుడు, ఆయన యాక్షన్ గురించి కాకుండా అనుష్క (స్వీటీ) గురించి మాట్లాడటం విశేషం. "నాకు ఆశ్చర్యం కలిగించిన మూమెంట్ అనుష్క ఎంట్రీ. మాహిష్మతిలోకి ఎంట్రీ ఇస్తుంటే.. దేవకన్య పైనుంచి కిందకు దిగి వచ్చినట్లు అనిపించింది. షి వాజ్ సింప్లీ 'స్టన్నింగ్'" అంటూ జక్కన్న ఆ సీన్‌ను గుర్తుచేసుకున్నాడు. రానా కూడా కత్తులు పట్టుకొని రకరకాల విషయాల గురించి సరదాగా మాట్లాడారు. ఇక ఈ ఫుల్ ఇంటర్వ్యూని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

ఈ రీ రిలీజ్ అంటే పాత సినిమాలను మళ్లీ వేయడం కాదు. రెండు భాగాలను కలిపి, కొత్తగా రీ మాస్టర్ చేసి, 'ది ఎపిక్' పేరుతో ఒకే సినిమాగా అందిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూతో సినిమాపై మళ్లీ హైప్ క్రియేట్ అయింది. ఏళ్లు గడిచినా, 'RRR'తో ఆస్కార్ వచ్చినా, ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయినా.. ఈ ముగ్గురి మధ్య బాండింగ్, ఆ జ్ఞాపకాలు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ ఇప్పుడు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.