బాహుబలి ఎపిక్ రన్ టైమ్.. సినిమా కోసం 5 గంటలా?
అయితే, ఈ ‘ఎపిక్’ వెర్షన్‌పై ఆసక్తిని రేకెత్తిస్తున్న ఏకైక అంశం.. ఇందులో కలపబోతున్న కొత్త సన్నివేశాలు.
By: M Prashanth | 16 Oct 2025 9:27 PM ISTఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన ‘బాహుబలి’.. ఇప్పుడు సరికొత్తగా, మరింత గ్రాండ్‌గా ‘ది ఎపిక్’ వెర్షన్‌గా మన ముందుకు రాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక మేజర్ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేయగా, సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 44 నిమిషాలుగా లాక్ అయింది. ఈ వార్త వినగానే ఫ్యాన్స్‌లో ఒకేసారి ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయి.
మూడు గంటల నలభై నాలుగు నిమిషాల సినిమా అంటే, అది మామూలు విషయం కాదు. ప్రేక్షకుడు థియేటర్‌లో దాదాపు నాలుగు గంటల పాటు కూర్చోవాలి. దీనికి ముందు, తర్వాత ప్రయాణ సమయాన్ని కూడా కలుపుకుంటే, ఈ సినిమా చూడటానికి కనీసం ఐదు గంటల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫాస్ట్ లైఫ్‌లో ఒక సినిమా కోసం దాదాపు సగంలో సగం కాలాన్ని వెచ్చించడం అనేది పెద్ద టాస్కే.
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ‘బాహుబలి’ రెండు భాగాలను ఇప్పటికే ప్రేక్షకులు వందల సార్లు చూసేశారు. థియేటర్, టీవీ, ఓటీటీ ప్రతీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. డైలాగులు, సీన్లు దాదాపు అందరికీ కొట్టిన పిండి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత భారీ రన్ టైమ్‌తో ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడం అనేది మేకర్స్‌కు అతిపెద్ద సవాల్.
అయితే, ఈ ‘ఎపిక్’ వెర్షన్‌పై ఆసక్తిని రేకెత్తిస్తున్న ఏకైక అంశం.. ఇందులో కలపబోతున్న కొత్త సన్నివేశాలు. ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని అన్‌సీన్ షాట్స్‌ను ఈ వెర్షన్‌లో యాడ్ చేస్తున్నామని మేకర్స్ ముందే ప్రకటించారు. ఇప్పుడు అందరి దృష్టి ఆ కొత్త సీన్స్‌పైనే ఉంది. అవి కథలో ఎంత కీలకంగా ఉంటాయి? సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచుతాయా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ రీ రిలీజ్ రిజల్ట్ పూర్తిగా ఆ కొత్తగా యాడ్ చేసే ఫుటేజ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఆ సీన్స్ ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతిని ఇస్తేనే, ఇంత సమయాన్ని వెచ్చించి థియేటర్‌కు వచ్చినందుకు సంతృప్తి కలుగుతుంది. లేదంటే, కేవలం కొన్ని నిమిషాల కోసం గంటల తరబడి కూర్చోవడం కష్టమే. ఇది ఒకరకంగా ‘బాహుబలి’ బ్రాండ్‌కు కూడా అగ్నిపరీక్ష లాంటిది. మొత్తం మీద, ‘బాహుబలి: ది ఎపిక్’ ఒక సాహసోపేతమైన ప్రయత్నం. రాజమౌళి మేకింగ్, కీరవాణి సంగీతం, విజువల్ వండర్స్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమే. మరి ఈ భారీ రన్ టైమ్ సినిమాకు ప్లస్ అవుతుందో, లేక మైనస్‌గా మారుతుందో తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వేచి చూడాల్సిందే.
