Begin typing your search above and press return to search.

బాహుబలి ఎపిక్ వెర్షన్.. ఏ ఏ సీన్స్ లేపేశారంటే?

అప్పుడు ప్రభాస్.. ఐదున్నర గంటల్లో ఓ అరగంట తీసి ఉంటారని అన్నారు. దానిపై జక్కన్న స్పందిస్తూ ఎపిక్ వెర్షన్ 3.43 నిమిషాల రన్ టైమ్ తో ఉంటుందని తెలిపారు.

By:  M Prashanth   |   29 Oct 2025 7:40 PM IST
బాహుబలి ఎపిక్ వెర్షన్.. ఏ ఏ సీన్స్ లేపేశారంటే?
X

బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు బాహుబలి 1, బాహుబలి 2.. ఒకే మూవీగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాహుబలి: ది ఎపిక్ గా అక్టోబర్ 31వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ముందు రోజు ప్రీమియర్స్ తో సందడి మొదలవ్వనుంది. అయితే రెండు మూవీలు కలిసి వస్తున్నాయి కనుక రీ రిలీజ్ వెర్షన్ రన్ టైమ్ ఎంత అనేది అందరికీ డౌట్.

ఇప్పటికే ఆ విషయంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కాస్త క్లారిటీ ఇచ్చినా అందరూ దాని కోసమే చర్చించుకుంటున్నారు. ఏ సీన్స్ ఉంచారో ఏవి తొలగించారోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్, రానాతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రన్ టైమ్ తోపాటు ఎడిటింగ్ అంశంపై మాట్లాడారు.

నిజానికి సినిమాలో వాడిన కత్తుల కోసం ముగ్గురూ మాట్లాడుతుండగా.. ప్రభాస్ రాజమౌళి దగ్గర కత్తి లేదని సరదాగా అన్నారు. వెంటనే తన దగ్గర అసలు ఆయుధముందని చెబుతూ.. కత్తెర తీసి చూపించారు. ఆ తర్వాత బాహుబలి ఎపిక్ వెర్షన్ లెంత్ ఎంత.. ఏవి లేపేశారని అడిగారు డార్లింగ్. అప్పుడు రెండు సినిమాలు కలిపి రోలింగ్ టైటిల్స్ తీసేస్తే ఐదున్నర గంటలుగా చెప్పారు జక్కన్న.

అప్పుడు ప్రభాస్.. ఐదున్నర గంటల్లో ఓ అరగంట తీసి ఉంటారని అన్నారు. దానిపై జక్కన్న స్పందిస్తూ ఎపిక్ వెర్షన్ 3.43 నిమిషాల రన్ టైమ్ తో ఉంటుందని తెలిపారు. సినిమాలో శివుడి పాత్రను ఎందుకు తీస్తానని అన్న జక్కన్న.. ఉంటుందని పరోక్షంగా చెప్పారు. సినిమాలో అవంతిక లవ్ స్టోరీతోపాటు పచ్చ బొట్టేసిన పాటను తీసేశామని వెల్లడించారు.

కన్నా నిదురించరా సాంగ్ తోపాటు ఇరుక్కుపో పాట తీశామని రాజమౌళి తెలిపారు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన అనేక సీన్స్ ను తొలగించామని చెప్పారు. ప్రభాస్, రానాకు సమానంగా కోతలు విధించానని అన్నారు. కానీ సినిమాలో ప్రతీ సీన్ కూడా కంటిన్యూషన్ గా అనిపిస్తుందని, బేసిక్ స్టోరీ ఉంటుందని తెలిపారు.

ఇప్పుడు రాజమౌళి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ నుంచి ఐస్ వరకు అన్ని ఫార్మాట్స్ లో బాహుబలి ఎపిక్ వెర్షన్ రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. హాట్ కేకుల్లా సినిమా టికెట్లు అమ్ముడవుతున్నాయి. కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ సాధించేలా కనిపిస్తోంది బాహుబలి ఎపిక్ వెర్షన్.