Begin typing your search above and press return to search.

బాహుబలి ఫ్రాంచైజీలో నెక్స్ట్.. 3Dతో సర్ప్రైజ్..

ప్రపంచ వ్యాప్తంగా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయిన బాహుబలి ఎపిక్ వెర్షన్ సందడి నిన్నటి ప్రీమియర్స్ తో మొదలైంది.

By:  M Prashanth   |   31 Oct 2025 10:59 AM IST
బాహుబలి ఫ్రాంచైజీలో నెక్స్ట్.. 3Dతో సర్ప్రైజ్..
X

బాహుబలి ఫ్రాంచైజీకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ టైటిల్స్ తో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఇప్పుడు ఆ రెండు చిత్రాలు.. ఒకే పార్ట్ గా బాహుబలి: ది ఎపిక్ గా రీ రిలీజ్ అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయిన బాహుబలి ఎపిక్ వెర్షన్ సందడి నిన్నటి ప్రీమియర్స్ తో మొదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. అయితే థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ మూవీ ప్రదర్శన సందర్భంగా.. సినీ ప్రియులకు మరో సర్ప్రైజ్ వచ్చింది. బాహుబలి ది ఎటర్నల్ వార్ మూవీ టీజర్ ప్రదర్శితమైంది.

అయితే బాహుబలి ఎపిక్ వెర్షన్ ప్రమోషన్స్ సమయంలోనే రాజమౌళి.. యానిమేషన్ మూవీగా బాహుబలి ది ఎటర్నల్ వార్ ఉంటుందని తెలిపారు. బాహుబలి-3 కాదని, కానీ బాహుబలి స్టోరీకి కంటిన్యూషన్ ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఎపిక్ వెర్షన్ తోపాటు టీజర్ ను రిలీజ్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

టీజర్ విషయానికొస్తే.. బాహుబలి చిన్ననాటి సన్నివేశాలతో పాటు శివగామి అతడిని పెంచిన విధానాన్ని చూపించారు. బాహుబలి మరణం తర్వాత ఆత్మ పై లోకాలకు వెళ్లడం, ఆ తర్వాత దేవతలు- రాక్షసుల మధ్య యుద్ధం వంటి సీన్స్ ను యాడ్ చేశారు. బాహుబలి రాక్షసుల వైపు ఉన్న మంచి వ్యక్తిగా చూపించి ఆసక్తి రేపారు.

దీంతో యానిమేషన్ మూవీ టీజర్ అదిరిపోయిందని, ఇంట్రెస్ట్ పెరిగిందని అంతా చెబుతున్నారు. అయితే బాహుబలి ది ఎటర్నల్ వార్ ను పార్ట్-1 అని అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో పార్ట్-2 కూడా ఉంటుందని, మరిన్ని సినిమాలు రానున్నాయని తెలుస్తోంది. అయితే ఎటర్నల్ వార్ మూవీ తొలి పార్ట్ ను 2026 లేదా 2027లో రిలీజ్ చేస్తారని సమాచారం.

అదే సమయంలో కథతోపాటు కథనంలో రాజమౌళి పర్యవేక్షణ ఉన్నా.. ఎటర్నల్ వార్ సినిమాను పలు హాలీవుడ్ యానిమేషన్ సినిమాలకు వర్క్ చేసిన ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తున్నారు. రూ.120 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని, ఇందులో అన్ని బాహుబలి పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్లు కనిపిస్తాయని రాజమౌళి ఇప్పటికే చెప్పారు. రెండున్నరేళ్లుగా ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుందని అన్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో అంతా వేచి చూడాలి.