బాహుబలి ఎపిక్ బాక్సాఫీస్.. సౌండ్ ఎంత గట్టిగా ఉందంటే..
కానీ, ఈ 9.25 కోట్ల వెనుక అసలు ట్రిక్ వేరే ఉంది. ఇది 'బాహుబలి' గొప్పతనం మాత్రమే కాదు, ప్రస్తుత సినిమాల 'వీక్‌నెస్'ను కూడా దారుణంగా బయటపెట్టింది.
By: M Prashanth | 1 Nov 2025 3:40 PM IST'బాహుబలి: ది ఎపిక్' దెబ్బకు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయింది. ఒక పాత సినిమా, రెండు భాగాలను కలిపి రీ రిలీజ్ చేస్తే, మొదటి రోజు 9.25 కోట్ల నెట్ వసూలు చేయడం.. ఇది రికార్డ్ కాదు, ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఇది రీ రిలీజ్‌లా లేదు, ఒక కొత్త బ్లాక్‌బస్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షోలా ఉంది. సినిమా రిలీజ్ టైమ్ లో జనాలు ఎలా ఊగిపోయారో, ఇప్పుడు మళ్లీ అదే ఫీవర్‌తో థియేటర్ల దగ్గర డైలాగులతో రచ్చ రచ్చ చేశారు.
అసలు జనాలు ఎందుకొచ్చారు? కథ తెలియక కాదు. సినిమాలోని ప్రతీ లైన్, ప్రతీ సీన్ వాళ్లకు గుర్తే. వాళ్లు వచ్చింది సినిమా చూడటానికి కాదు, ఆ 'ఫీలింగ్'ను, ఆ 'నాస్టాల్జియా'ను మళ్లీ బిగ్ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. ప్రభాస్ శివలింగం ఎత్తినప్పుడు, కట్టప్ప ఎంట్రీకి విజిల్స్ వేయడానికి, ఆ గూస్‌బంప్స్ తెప్పించే ఎమోషన్‌ను మళ్లీ ఫీల్ అవ్వడానికి వచ్చారు.
కానీ, ఈ 9.25 కోట్ల వెనుక అసలు ట్రిక్ వేరే ఉంది. ఇది 'బాహుబలి' గొప్పతనం మాత్రమే కాదు, ప్రస్తుత సినిమాల 'వీక్‌నెస్'ను కూడా దారుణంగా బయటపెట్టింది. సరైన ఎమోషన్, గ్రిప్పింగ్ డ్రామా, గూస్‌బంప్స్ ఇచ్చే 'సినిమాటిక్ మ్యాజిక్' కోసం ఆడియెన్స్ ఎంత ఆకలితో ఉన్నారో ఈ రెస్పాన్స్ చూపిస్తోంది. రొటీన్, అవుట్‌డేటెడ్ ట్రైలర్లకు 'జీరో ఓపెనింగ్స్' ఇచ్చి, పదేళ్ల నాటి పాత సినిమాకు 9 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ఇచ్చారంటే.. ఆడియెన్స్ మూడ్ ఎంత క్లియర్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ విజయం ప్రభాస్ కెరీర్‌కు కూడా పెద్ద బూస్ట్. అతని రీ రిలీజ్ సినిమాలు వర్షం, బిల్లా పెద్దగా క్లిక్ కాలేదు. రీ రిలీజ్ లో వెనుకబడ్డాడని కామెంట్స్ చేసిన వాళ్లకు ఇది పెద్ద సమాధానం. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఫిట్‌నెస్, ఆ రాజసం చూసి ఫ్యాన్స్ మళ్లీ ఫిదా అయ్యారు. ఆయన రీసెంట్ సినిమాల్లో ఫ్యాన్స్ దేన్నైతే మిస్ అయ్యారో, దాన్ని 'ది ఎపిక్' మళ్లీ గుర్తు చేసింది.
ఈ దెబ్బతో 'రీ రిలీజ్' మార్కెట్ రూల్స్ మొత్తం మారిపోయాయి. ఇది కొత్త సినిమాలకు డైరెక్ట్ థ్రెట్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రెస్పాన్స్ (మొత్తం 9.25 కోట్లలో హిందీ 1.5 కోట్లు పోగా, మెజారిటీ సౌత్, అందులోనూ తెలుగే) అన్‌బిలీవబుల్. ఆ ఎమోషనల్ కనెక్షన్ ఇంకా బలంగా ఉందని, పదేళ్లయినా విజువల్స్ ఫ్రెష్‌గానే ఉన్నాయని ఆడియెన్స్ ఫీల్ అయ్యారు.
ఓవరాల్‌గా, 'బాహుబలి: ది ఎపిక్' అనేది ఒక రీ రిలీజ్ కాదు, అదొక 'నాస్టాల్జియా కాన్సర్ట్' అను నిరూపించారు. రాజమౌళి మేకింగ్, కీరవాణి బీజీఎం, ప్రభాస్ అనుష్క కెమిస్ట్రీ పదేళ్లయినా చెక్కు చెదరలేదని ప్రూవ్ అయింది. ఈ 3 గంటల 40 నిమిషాల ఎడిటెడ్ వెర్షన్.. ప్రతీ పైసాకు, ప్రతీ నిమిషానికి వర్త్ అని మరికొందరు అంటున్నారు.
