రాజమౌళి ఎపిక్ థాట్స్.. నెక్స్ట్ లెవెల్ అంతే..!
బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయేలా చేశాడు రాజమౌళి.
By: Ramesh Boddu | 6 Oct 2025 12:14 PM ISTబాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయేలా చేశాడు రాజమౌళి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్ లో తెలుగు సినిమా స్టామినా చూపిస్తున్నాయి అంటే మొదటి అడుగు పడింది బాహుబలితోనే. అందుకే ఆ సినిమా ఎప్పటికీ సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఇక రాజమౌళి బాహుబలి 1 అండ్ 2 సినిమాలను ప్రత్యేకంగా తెరకెక్కించారు. రెండు సినిమాలు నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రికార్డులు సృష్టించాయి.
బాహుబలి ది ఎపిక్ కోసం రాజమౌళి..
ఐతే సినిమా రిలీజై 10 ఏళ్లు అవుతున్నా కూడా బాహుబలి హంగామా ఎక్కడ తగ్గట్లేదు. ఐతే బాహుబలి 1 అండ్ 2 కలిపి బాహుబలి ది ఎపిక్ అంటూ రాజమౌళి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న ఈ టైం లో రెండు భాగాలను ఒకే సినిమాగా చెప్పడం క్రేజీగా ఉంది. అంతేకాదు ఈ సినిమాకు రాజమౌళి మళ్లీ పనిచేస్తున్నారట. కొన్ని బాహుబలి 1, 2 లో లేని కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారట. అంటే బాహుబలి ది ఎపిక్ మళ్లీ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతుందని చెప్పొచ్చు.
సినిమాలో మిగిలిన కొన్ని సీన్స్ ని బాహుబలి ఎపిక్ లో యాడ్ చేస్తారట. అంతేకాదు ఈ సినిమా చివర్లో బాహుబలి సీక్వెల్ బాహుబలి 3 అనౌన్స్ చేస్తారని లేటెస్ట్ టాక్. బాహుబలి 3 కథను కట్టప్ప నేపథ్యంతో రాస్తున్నట్టుగా ఆమధ్య వార్తలు వచ్చాయి. వాటికి సంబందించిన అనౌన్స్ మెంట్ కూడా బాహుబలి ది ఎపిక్ లో చూపిస్తారట.
ఎపిక్ ఈవెంట్ కి ప్రభాస్, రానా..
బాహుబలి ది ఎపిక్ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొత్త సినిమాగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి ది ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారట. ఆ ఈవెంట్ కి ప్రభాస్, రానా కూడా వస్తారని టాక్. సో మొత్తానికి మళ్లీ రాజమౌళి తన ఎపిక్ థాట్స్ తో బాహుబలి ఎపిక్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే రెండు భాగాలుగా వచ్చిన ప్రతి సినిమా ఇదే పంథా కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 సినిమా చేస్తున్నారు. ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. నవంబర్ లో ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారన్న టాక్ ఉంది. అక్టోబర్ నెల మొత్తం రాజమౌళి బాహుబలి ది ఎపిక్ కోసం టైం కేటాయిస్తున్నాడట రాజమౌళి. మొత్తానికి జక్కన్న బాహుబలి కోసం మళ్లీ పనిచేయడం రెబల్ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుంది.
