Begin typing your search above and press return to search.

రాజమాత శివగామిగా రమ్యకృష్ణ కాకుంటే..?

సినిమాల్లో కొన్ని పాత్రలు కొంతమంది కోసమే అన్నట్టుగా ఉంటుంది. సినిమా రిలీజై ఆ రోల్ సూపర్ హిట్ అయిన తర్వాత ఆ పాత్రలో వాళ్లు తప్ప మిగతా వారిని ఊహించడం కష్టమే అవుతుంది.

By:  Ramesh Boddu   |   24 Oct 2025 9:54 AM IST
రాజమాత శివగామిగా రమ్యకృష్ణ కాకుంటే..?
X

సినిమాల్లో కొన్ని పాత్రలు కొంతమంది కోసమే అన్నట్టుగా ఉంటుంది. సినిమా రిలీజై ఆ రోల్ సూపర్ హిట్ అయిన తర్వాత ఆ పాత్రలో వాళ్లు తప్ప మిగతా వారిని ఊహించడం కష్టమే అవుతుంది. ఇక కొన్ని పాత్రలైతే వారి కోసమే రాసినట్టుగా.. వాళ్ల కోసమే పుట్టినట్టుగా ఉంటాయి. అలాంటి ఐకానిక్ పాత్రల్లో బాహుబలి రాజమాత శివగామి రోల్ ఒకటి. సినిమాలో శివగామి పాత్ర వెనక చాలా పెద్ద స్టోరీ నడిచింది. శివగామి రోల్ లో రాజమౌళి ముందు శ్రీదేవిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేకపోయింది.

శివగామి రోల్ లో రమ్యకృష్ణ..

ఐతే శివగామి రోల్ లో రమ్యకృష్ణ కూడా చేయడానికి ముందు నిరాకరించిందట. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రమ్యకృష్ణకు కాల్ చేసి శివగామి పాత్ర గురించి చెప్పి సినిమాకు 40 రోజుల డేట్స్ ఇవ్వాలని అడిగితే.. అన్ని రోజులు అయితే కష్టమే సారీ సినిమా చేయలేనని చెప్పిందట. కానీ రాజమౌళి సినిమా.. బడ్జెట్.. ఇంకా మిగతా విషయాలన్నీ తెలిసి సినిమాకు సైన్ చేసిందట.

బాహుబలి సినిమాలో రాజమత శివగామి రోల్ లో రమ్యకృష్ణ అదరగొట్టేశారు. ఆమె తప్ప ఆ రోల్ కి మరెవరిని ఊహించలేం అన్నట్టు చేశారు. ఐతే ఈ సినిమాలో ఒక బేబీని చేతిలో పట్టుకుని చేసే సీన్స్ లో నిజంగానే ఆమె రాజమాతలా ఫీలైందట. సినిమా అంత ఇంపాక్ట్ చూపించిందని రమ్యకృష్ణ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. బాహుబలి ది బిగినింగ్ సీన్ మొదలయ్యేది రాజమాత శివగామి సీన్ తోనే.. ఆమె అలా చేతితో పిల్లాడిని పైకి ఎత్తుకుని నీళ్లల్లో ప్రయాణిస్తారు.

బాహుబలి ఎపిక్ అంటూ రెండు భాగాలు కలిపి..

ఆ సీన్ తోనే సినిమా మొదలై.. అదే రేంజ్ లో కొనసాగుతుంది.. బాహుబలి శివగామి పాత్రతో రమ్యకృష్ణ మరోసారి తన వర్సటాలిటీ చూపించారు. దాదాపు 30 ఏళ్లుగా సినిమాల్లో రాణిస్తున్న ఆమెకు శివగామి పాత్ర మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. బాహుబలి 1 అండ్ 2 సినిమాలు సూపర్ హిట్ సెన్సేషనల్ గా మారాయి. ఈ సినిమా ప్రేమికుల కోసం బాహుబలి ఎపిక్ అంటూ రెండు భాగాలు కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 31న బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ అవుతుంది. దీని కోసం రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

బాహుబలి 1 అండ్ 2 సినిమాలు తెలుగు ప్రేక్షకులకు చాలా గొప్ప అనుభూతులు కలిగించింది. ఇప్పుడు రెండు భాగాలు కలిపి ఒక సినిమాగా వస్తుండటం తో ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. సినిమాలో కొన్ని కొత్త సీన్స్ కూడా యాడ్ చేసి సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.