RRR బూస్ట్ తో బాహుబలి ఎపిక్ ప్లాన్
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన దమ్మున్న దర్శకుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: M Prashanth | 8 Oct 2025 10:06 AM ISTభారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన దమ్మున్న దర్శకుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా, 'RRR' తర్వాత జక్కన్న బ్రాండ్ ఇమేజ్ ఏ రేంజ్‌కు పెరిగిందంటే, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్‌ను టచ్ చేసినా ఇంటర్నేషనల్ లెవల్లో దానికి క్రేజ్ దానంతట అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ కనెక్షన్ తో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో, జక్కన్న సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ రావడంతో సినీ ప్రపంచం మొత్తం అటెన్షన్ ఆ వైపు మళ్లింది.
అసలు మన తెలుగు సినిమా సత్తా ఏంటో, ఇక్కడి విజువల్స్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించిన ఫిల్మ్ 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను పలకరించబోతోంది.
సినిమాను మళ్లీ రిలీజ్ చేయడం కామనే అయినా, ఈసారి మేకర్స్ ఎంచుకున్న వ్యూహం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రీ రిలీజ్ ప్రాజెక్ట్‌కు 'బాహుబలి ది ఎపిక్' అనే టైటిల్ పెట్టారు. ఈ రెండు భాగాలను కలిపి రిలీజ్ చేస్తున్న ఈ స్పెషల్ వెర్షన్‌లో, సినిమాటిక్ అప్‌గ్రేడ్‌తో పాటు అన్‌సీన్ షాట్స్, అలాగే ఇంతవరకు చూడని కొత్త కంటెంట్ కూడా యాడ్ చేసినట్లు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా కన్‌ఫర్మ్ చేశారు. ఇది ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పవచ్చు.
మేకర్స్ ఈ 'ఎపిక్' రిలీజ్‌ను సాధారణ రీ రిలీజ్‌లా కాకుండా, 'RRR' సక్సెస్ రూట్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్‌లో 'RRR'కు వచ్చిన ఆదరణ, ఓటీటీలో దానికి లభించిన రెస్పాన్స్ చూశాక, ఇప్పుడు గ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా విదేశీ ప్రేక్షకులను టార్గెట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో, ఓవర్సీస్‌లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ కోసం టీమ్ భారీగా ప్రయత్నాలు చేస్తోంది.
జక్కన్న మేకింగ్ అంటే ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో హాలీవుడ్ టెక్నీషియన్స్, విదేశీ జనాలు స్వయంగా చూశారు. వాళ్లు రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన తర్వాత, 'బాహుబలి'ని ఒక ఎపిక్ ఫిల్మ్‌గా వాళ్లకు కనెక్ట్ చేయడం ఇప్పుడు మరింత ఈజీ అవుతుంది. అందుకే, ఈ రీ రిలీజ్‌కు రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ అతిపెద్ద అస్సెట్‌గా మారింది. మొత్తానికి, కొత్త ఫుటేజ్‌తో రాబోతున్న ఈ 'బాహుబలి ఎపిక్'ను బిగ్గెస్ట్ మూవీ రీ రిలీజ్ అని చెప్పవచ్చు. మరి ఈ రీ రిలీజ్ అనుకున్నంత స్థాయిలో ఓవర్సీస్‌లో క్లిక్ అవుతుందో లేదో చూడాలి.
