Begin typing your search above and press return to search.

జక్కన్న సైతం ఇలా అవుతుందని ఊహించక పోవచ్చు..!

టాలీవుడ్‌ స్టామినాను బాలీవుడ్‌కి, ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్‌కి చాటి చెప్పిన దర్శక దిగ్గజం రాజమౌళి.

By:  Ramesh Palla   |   30 Oct 2025 12:08 PM IST
జక్కన్న సైతం ఇలా అవుతుందని ఊహించక పోవచ్చు..!
X

టాలీవుడ్‌ స్టామినాను బాలీవుడ్‌కి, ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్‌కి చాటి చెప్పిన దర్శక దిగ్గజం రాజమౌళి. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్‌లను ఇప్పుడు ఒక్క పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ చేశారు. టెక్నికల్‌గా అయితే ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల లెక్కలోకి వస్తుంది. గతంలో వచ్చిన సినిమాలను ఒక్క సినిమాగా చేసి రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారు. కనుక టాలీవుడ్‌ ప్రేక్షకులు, ఇతర భాషల ప్రేక్షకులు బాహుబలి : ది ఎపిక్ ను పెద్దగా పట్టించుకోక పోవచ్చు అని మేకర్స్‌, ఇండస్ట్రీ వర్గాల వారు అనుకున్నారు. కానీ బాహుబలి : ది ఎపిక్‌ కి వస్తున్న రెస్పాన్స్ చూసి, సోషల్‌ మీడియాలో సినిమా గురించి జరుగుతున్న ప్రచారం చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా తెగ హడావిడి కనిపిస్తుంది. అక్టోబర్‌ 31న ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

బాహుబలి : ది ఎపిక్‌ రిలీజ్‌కు రెడీ

వారం ముందుగానే ప్రారంభం అయిన అడ్వాన్స్ బుకింగ్‌ను చూసి బాక్సాఫీస్ వర్గాల వారు కూడా షాక్ అవుతున్నారు. స్టార్‌ హీరోల కొత్త సినిమాలకు కూడా సాధ్యం కాని నెంబర్స్‌ను ఈ సినిమా రీ రిలీజ్‌ లో చూపిస్తోందని బాక్సాఫీస్‌ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఆ స్థాయిలో సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌ అయింది. కేవలం ఒక్క షో లేదా ఒక్క రోజు షో లు అని కాకుండా రాబోయే వీకెండ్‌ మొత్తం ఫుల్‌ ప్యాక్ అన్నట్లుగా బాహుబలి : ది ఎపిక్‌ మూవీ టికెట్లు బుక్‌ అయ్యాయి. సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ సేల్‌ జోరు చూస్తూ ఉంటే సినిమా భారీ వసూళ్లు నమోదు చేయడం మాత్రమే కాకుండా, డైరెక్ట్‌ సినిమాల రికార్డ్‌లను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి : ది ఎపిక్‌ మూవీ వంద కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫ్యాన్స్ ఇప్పటికే తెగ సందడి చేస్తున్నారు.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో...

సినిమాకు వస్తున్న ఆధరణ, పెరిగిన అంచనాలు చూస్తూ ఉంటే సరికొత్త రికార్డ్‌లు నమోదు కావడం ఖాయం అనిపిస్తుంది. ఈ స్థాయి రెస్పాన్స్‌ను ఆర్కా మీడియా వారు కానీ, దర్శకుడు రాజమౌళి కానీ, ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు కానీ ఊహించి ఉండరు అనిపిస్తుంది. ఒక రీ రిలీజ్ సినిమా కోసం ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూడటం, మీడియాలో ఈ స్థాయిలో రెస్పాన్స్ దక్కడం, మీడియా కవరేజ్‌ ఈ స్థాయిలో రావడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్‌ మాత్రమే చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం ఆఫ్ ది రికార్డ్‌ మాట్లాడుకుంటూ ఉన్నారు. బాహుబలి : ది ఎపిక్‌ లో కొత్త సీన్స్‌ యాడ్‌ చేయబోతున్నారు అని, అవి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే విధంగా ఉంటాయి అని ప్రచారం కూడా జరిగింది కానీ అది నిజం కాదు అని రాజమౌళి కూడా చెప్పారు . అయినా కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్‌ మరింతగా పెరిగినట్లు చెప్పుకోవచ్చు.

ప్రభాస్‌, అనుష్క, తమన్నా....

బాహుబలి రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ రెండు పార్ట్‌లను ఇప్పుడు 3 గంటల 45 నిమిషాల నిడివితో ఒకే పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సాధారణంగా మూడు గంటల మూవీ అంటేనే బాబోయ్ అంటారు. అలాంటిది ఏకంగా మూడు గంటల నలభై ఐదు నిమిషాల నిడివి అంటే మా వల్ల కాదని అంటారు. కానీ బాహుబలి సినిమా మూడు గంటలు కాదు ఐదు గంటలు ఉన్నా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే రాజమౌళి అద్బుతమైన విజువల్స్ తో పాటు ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానాల స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఎంత నిడివి ఉన్నా కూడా బోర్‌ కొట్టించదు. అందుకే సినిమా మూడున్నర గంటలకు పైగా ఉన్నా కూడా చూసేందుకు బుకింగ్ తెగ చేసుకుంటున్నారు. తెలిసిన కథే అయినా కూడా ఎలా ఉంటుందా అని మళ్లీ ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. ఇక ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా కొత్త విజువల్స్‌ను రెడీ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే లాంగ్‌ రన్‌లోనూ బాహుబలి : ది ఎపిక్‌ తెగ సందడి చేయడం ఖాయం.