Begin typing your search above and press return to search.

బాహుబలి.. రీ రిలీజ్ లో ఈ సీన్ పడితే థియేటర్లు బ్లాస్టే!

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి.

By:  M Prashanth   |   19 Oct 2025 12:00 AM IST
బాహుబలి.. రీ రిలీజ్ లో ఈ సీన్ పడితే థియేటర్లు బ్లాస్టే!
X

బాహుబలి తెలుగు సినిమా చరిత్రలో ఓ అద్భుతమైన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సరిహద్దుల్ని చెరిపేస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. జక్కన్న విజన్, సీన్ మేకింగ్ నా భుతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉంటుందీ సినిమా. ఈ భారీ బ్లాక్ బస్టర్ రిలీజై ఈ ఏడాదికి 10ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో బాహుబలి రెండు పార్ట్ లను కలిపి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇదే నెల 31న థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. అప్పుడు సినిమా రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ లో చెప్పిన విషయాలు, సెట్స్ లో జరిగిన సరదా సంభాషణలు ఇలా రోజుకొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జక్కన్న విజన్ ను కళ్లకు కట్టే వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు గుస్ బంప్స్ వస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఆ వీడియో ఏంటంటే?

ఈ వీడియో బాహుబలి తొలి పార్ట్ ప్రమోషన్స్ సమయంలోనిది. ఇందులో ఇంటర్వెల్ సీన్ గురించి రాజమౌళి తాను అనుకున్న విజన్, ఒరిజినల్ గా రావాల్సిన సీన్ గురించి వివరంగా చెబుతుంటారు. కానీ, సినిమాలో మాత్రం ఆ వెర్షన్ లో లేదు. కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ కటింగ్ లో ఇంకొక వెర్షన్ ఇంటర్వెల్ ను మనకు చూపించారు. కానీ తాను అనుకున్న విజన్ ను జక్కన్న ఆ ఇంటర్వ్యూలో చెబుతుంటారు.

బాహుబలిని చూశామంటూ సైనికుడు బిజ్జలదేవుడి దగ్గరకు వచ్చి చెప్తాడు. అప్పుడు బిజ్జలదేవుడు సైనితుడితో.. ఎక్కడ నుంచి వస్తాడురా బాహుబలి. వాడు లేడు చచ్చిపోయాడు. వాడి ప్రాణాలను మట్టిలో కలిపేశాం, అనగానే ఇంట్రో కట్ లో బాహుబలి భూమిని చీల్చుకుంటూ వస్తాడు. ఆ తర్వాత శరీరాన్ని కాల్చి మంటల్లో కలిపేశాం అనగానే మంటలు దాటుకొని వస్తాడు. అలా బిజ్జలదేవుడు చెప్పే డైలాగ్ కు ఒక్కో ఎలిమెంట్ నుంచి బాహుబలి వస్తాడు. ఫైనల్ గా బాహుబలి లేడు, చచ్చిపోయాడు అనగానే ప్రభాస్ ల్యాండ్ అవుతాడు. అప్పుడు దేవసేన మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు. అనే డైలాగ్ ఉంటుంది. ఇది నేను రాసుకున్న ఒరిజినల్ విజన్ అని జక్కన్న చెబుతాడు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఫ్యాన్స్ జక్కన్న విజన్ కు అనుగునంగా ఎడిట్ చేసి వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం ఇదే విజన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఒరిజినల్ సీన్ గనుక స్క్రీన్ పై పడితే థియేటర్లు బద్దలైపోవడం పక్కా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి బాహుబలి ది ఎపిక్ లో ఎలాంటి సీన్స్ తీసేశారు? ఏయే సీన్స్ యాడ్ చేశారో తెలియాలంటే ఈనెల 31 గాకా ఆగాల్సిందే!