జక్కన్నకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన బాహుబలి టీమ్
ఇప్పటివరకు కెరీర్లో అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి సినిమా సినిమాకీ తన స్థాయిని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 7:33 PM ISTరాజమౌళి. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఒక చరిత్ర. ఇప్పటివరకు కెరీర్లో అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి సినిమా సినిమాకీ తన స్థాయిని మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు. ఇవాల్టికి జక్కన్నకు 52 ఏళ్లు నిండాయి. రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి.
వెల్లువెత్తిన బర్త్ డే విషెస్
జక్కన్న పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో సినిమాలు చేసిన నటీనటులతో పాటూ ప్రస్తుతం అతనితో సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి అనేది ఓ చరిత్ర. తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే చెందుతుంది. అయితే జక్కన్న బర్త్ డే ను పురస్కరించుకుని బాహుబలి మేకర్స్ ఓ సర్‌ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన బాహుబలి టీమ్
ది మేకింగ్ ఆఫ్ మ్యాజిక్ అనే పేరుతో వచ్చిన ఈ వీడియోలో రాజమౌళి కెమెరా వెనుక పడిన కృషితో పాటూ, నటీనటులను గైడ్ చేయడం, షాట్ సరిగ్గా రాకపోతే దాన్ని కరెక్ట్ చేయడం, ప్రతీ ఫ్రేమ్ లో పర్ఫెక్షన్ ఉండేలా చూసుకోవడం లాంటివి చూపించారు. సెట్స్ లో రాజమౌళి ఎలా ఉంటారో, ఆయన ఎంత ఫోకస్డ్ గా ఉంటారో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.
అక్టోబర్ 31న బాహుబలి రీరిలీజ్
ఆ వీడియోలో బిజ్జలదేవగా ఉన్న నాజర్ కు ఎలా నటించాలో చూపించడంతో పాటూ ప్రభాస్ నటించిన ఐకానిక్ సీన్స్ లో ముందు తాను యాక్ట్ చేసి చూపించడం లాంటి ఎన్నో క్లిప్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే బాహుబలి కోసం రాజమౌళి పెట్టిన ఎఫర్ట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బాహుబలి సినిమా రిలీజై పదేళ్లు పూర్తైన సందర్భంగా చిత్ర యూనిట్ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా మార్చి అక్టోబర్ 31న రీరిలీజ్ చేస్తున్నారు. బాహుబలి మ్యాజిక్ ను ఆస్వాదించడానికి ఆడియన్స్ తిరిగి థియేటర్లకు వెళ్లడానికి రెడీగా ఉన్నారు. రాజమౌళి బర్త్ డే సందర్భంగా స్పెషల్ గా రిలీజైన ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, జక్కన్న బర్త్ డే కేవలం పుట్టినరోజులాగా మాత్రమే కాకుండా ఒక సెలబ్రేషన్ లాగా మార్చారు.
