మెంటల్ ఎక్కింది.. గౌతమ్ ఘట్టమనేని రివ్యూ
'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్ హంగామా మామూలుగా లేదు. ఇండియన్ సినిమా క్లాసిక్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఆడియెన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు.
By: M Prashanth | 30 Oct 2025 11:47 AM IST'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్ హంగామా మామూలుగా లేదు. ఇండియన్ సినిమా క్లాసిక్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఆడియెన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా ఈ అద్భుతాన్ని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాడు. సినిమా చూసిన తర్వాత గౌతమ్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'బాహుబలి' లాంటి ఒక బిగ్గెస్ట్ గ్లోబల్ ఫిలింను బిగ్ స్క్రీన్ మీద చూడటం అనేది ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అని గౌతమ్ అన్నాడు. అయితే, ఈ 'ఎపిక్' వెర్షన్‌లో అతనికి నచ్చిన బెస్ట్ విషయం ఏంటో చాలా ఫన్నీగా చెప్పాడు. "నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఈసారి రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు" అంటూ నవ్వేశాడు.
సినిమా చూస్తున్నంత సేపు తన ఫీలింగ్ ఎలా ఉందో వివరిస్తూ, "ఇది ఒక ఎపిక్ ప్రపోర్షన్స్‌లో ఉన్న సినిమా. ప్రతీ సెకను నాకు గూస్‌బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఇది మెంటల్ ఎక్కిపోయే ఫీలింగ్. ఆ ఫీలింగ్‌ను నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను" అంటూ తన ఎగ్జైట్‌మెంట్‌ను షేర్ చేసుకున్నాడు.
ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకోవడంపై గౌతమ్ చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. "మన తెలుగు సినిమాకు ఇంత గ్లోబల్ రెస్పెక్ట్ రావడం గ్రేట్. ఇలాంటి సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఇది గ్రేటెస్ట్ ఫీలింగ్" అని అన్నాడు. ఒక యంగ్ జనరేషన్ స్టార్ కిడ్‌గా, తన ఇండస్ట్రీ సాధించిన విజయం గురించి గౌతమ్ చాలా ప్రౌడ్‌గా మాట్లాడాడు.
ఇక ఇంటర్వ్యూ చివర్లో, యాంకర్ అసలు సిసలైన ప్రశ్న అడిగాడు. "బాహుబలి మేకర్ (రాజమౌళి), మీ డాడీ (మహేష్ బాబు)తో సినిమా తీస్తున్నారు కదా.. ఆ ఫీలింగ్ ఏంటి?" అని అడగ్గానే, గౌతమ్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఆ టాపిక్ గురించి మాట్లాడకూడదని సైగ చేస్తూ, "ప్లీజ్.." అంటూ చాలా స్మార్ట్‌గా ఆ ప్రశ్నను దాటవేశాడు. ఏదేమైనా, 'బాహుబలి' రీ రిలీజ్ వెర్షన్‌ను గౌతమ్ పూర్తిగా ఎంజాయ్ చేసినట్లు అతని మాటలను బట్టి తెలుస్తోంది. ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న గౌతమ్, భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.
