బాహుబలి ఎపిక్.. ఆ రెండు ఎలా తట్టుకుంటాయో?
నిజానికి అక్టోబర్ 31వ తేదీన బాహుబలి ఎపిక్ వెర్షన్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కొత్త మాస్ జాతర మూవీ రిలీజ్ కు సిద్ధమైంది.
By: M Prashanth | 27 Oct 2025 8:31 PM ISTవిజువల్ వండర్ బాహుబలి: ది ఎపిక్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు కలిపి ఒకే మూవీ రూపంలో ఎపిక్ వెర్షన్ గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31వ తేదీన థియేటర్స్ లో సందడి చేయనుంది. ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.
నేటి ట్రెండ్ కు కలర్ గ్రేడింగ్ చేసి, ఐమాక్స్ ఫార్మాట్ లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అందుకు గాను ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడవుతున్నాయి. దీన్ని బట్ట సినిమా కోసం మూవీ లవర్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది.
అదే సమయంలో మేకర్స్.. ప్రమోషన్స్ ను అదిరిపోయే రీతిలో చేస్తున్నారు. మూవీపై ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో కచ్చితంగా సినిమా చూడాలని అంతా ఫిక్స్ అయిపోయారు.. మరికొందరు అవుతున్నారు కూడా. అదంతా బాగానే ఉన్నా.. బాహుబలి: ది ఎపిక్ వెర్షన్ ప్రభావం.. రెండు కొత్త సినిమాలపై గట్టిగా పడేలా కనిపిస్తోంది.
నిజానికి అక్టోబర్ 31వ తేదీన బాహుబలి ఎపిక్ వెర్షన్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కొత్త మాస్ జాతర మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. దాంతోపాటు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్.. ఆర్యన్ సినిమా కూడా విడుదలకు రెడీ అయింది. ఇప్పటికే ఆ రెండు చిత్రాల మేకర్స్.. ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.
కానీ బాహుబలి: ది ఎపిక్ వెర్షన్ మూవీ ఎఫెక్ట్ ను ఎలా తట్టుకుంటాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే కంటెంట్ పై నమ్మకం ఉన్నా.. పోటీ ఇష్టం లేక మాస్ జాతర మూవీని ఒక రోజు పోస్ట్ పోన్ చేయాలని నిర్మాత నాగవంశీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
మరోవైపు.. ఆర్యన్ మూవీని గ్రాండ్ గా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అందుకోసం హీరో తెలుగులో ఫుల్ జోష్ తో ప్రమోట్ కూడా చేస్తున్నారు. సినిమాపై మంచి బజ్ పెంచేలా ప్రణాళికలు వేసుకున్నట్లు కనిపించారు. కానీ బాహుబలి ఎపిక్ వెర్షన్ ఎఫెక్ట్ పడకుండా ఏం చేస్తారో మరి. ఏదేమైనా అటు మాస్ జాతర.. ఇటు ఆర్యన్.. కంటెంట్ క్లిక్ అయితేనే మంచి వసూళ్లు వస్తాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
