Begin typing your search above and press return to search.

మరీ ఇంత 'ఎ' కంటెంట్‌ అవసరమా..?

ఎ సర్టిఫికెట్‌ వస్తే యూత్‌ ఆడియన్స్‌ ఖచ్చితంగా థియేటర్లకు క్యూ కడుతారని, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా అలవాటే అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

By:  Ramesh Palla   |   5 Sept 2025 12:00 AM IST
మరీ ఇంత ఎ కంటెంట్‌ అవసరమా..?
X

కమర్షియల్‌ సినిమా అంటే మినిమం యూ/ఎ సర్టిఫికెట్‌ ఉండాల్సిందే అనేది ప్రస్తుత మాట. ఇక పెద్ద హీరోలు, ఇంకాస్త గట్టి కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉంటే ఎ సర్టిఫికెట్‌ రావాల్సిందే. గతంలో తమ సినిమాలకు ఎ సర్టిఫికెట్‌ వస్తే ఎక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారో అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సినిమా వారి తీరు మారింది. ఎ సర్టిఫికెట్‌ వస్తే యూత్‌ ఆడియన్స్‌ ఖచ్చితంగా థియేటర్లకు క్యూ కడుతారని, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా అలవాటే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం కనిపించే సన్నివేశాలు ఈ మధ్య కాలంలో సినిమాల్లో చాలా కామన్‌ అయింది. ఒకప్పుడు ఎ సినిమా అంటే అడల్ట్‌ కంటెంట్‌ మూవీ అనేది. కానీ ఇప్పుడు యాక్షన్‌ సీన్స్‌ కి కూడా ఎ ఇస్తున్నారు అంటే ఏ స్థాయిలో హింసను ఆ సినిమాల్లో చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

బాలీవుడ్‌ నుంచి మరో భారీ యాక్షన్‌ మూవీ..

ఆ మధ్య వచ్చిన కొన్ని యాక్షన్‌ సినిమాలకు ఎ సర్టిఫికెట్‌ రావడం ద్వారా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. బాలీవుడ్‌తో పోల్చితే ఈ మధ్య కాలంలో సౌత్‌ ఇండియాలో ఎక్కువగా హింస ఉంది. సింపుల్‌ సినిమాలు తీసే మలయాళం ఇండస్ట్రీ వారు సైతం ఎ సినిమాలను తీస్తున్నారు అంటే ఏ స్థాయిలో ప్రేక్షకులు యాక్షన్‌ను ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. హింసాత్మక సన్నివేశాలను కొందరు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు.. కొందరు నార్మల్‌గా తీసుకుంటారు. ఓవరాల్‌గా హింస ఉండటం వల్ల పబ్లిసిటీ దక్కుతుంది, అంతే కాకుండా ప్రేక్షకుల అటెన్షన్‌ను ఎక్కువగా దక్కించుకోవచ్చు. అందుకే ఎ కంటెంట్‌ సినిమాలు ఈ మద్య కాలంలో బాలీవుడ్‌లోనూ కామన్‌ అవుతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టైగర్ ష్రాఫ్ హీరోగా బాఘీ 4 మూవీ

బాలీవుడ్‌ నుంచి రాబోతున్న బాఘీ ప్రాంచైజీ మూవీ బాఘీ 4 పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న బాఘీ ప్రాంచైజీ సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా బాఘీ 4 సినిమాను రూపొందించారు. కానీ ఇప్పటి వరకు లేని విధంగా బాఘీ 4 సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలానే ఉన్నాయట. సెన్సార్‌ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సినిమాలోని కొన్ని సీన్స్‌ను చూసి మరీ ఇంత హింస అవసరమా అన్నట్లుగా ప్రశ్నించారట. శవ పేటిక మీద నిల్చుకోవడం, నరికిన చేతిని చేతిలో పట్టుకోవడం వంటివి అతిగా ఉన్నాయని, ఎ సర్టిఫికెట్‌ను మించి ఉన్నాయనే అభిప్రాయంను సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు వ్యక్తం చేశారట. ఈ మధ్య కాలంలో మరీ ఇలాంటి హింసాత్మక సినిమాలు హిందీలో రాలేదు అనేది చాలా మంది మాట.

వర్షం రీమేక్‌గా మొదలైన బాఘీ ప్రాంచైజీ

టైగర్‌ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎ హర్ష దర్శకత్వం వహించాడు. శాండల్‌ వుడ్‌ దర్శకుడు అయిన హర్ష ఈ సినిమాలో టైగర్‌ ష్రాప్‌ లోని మరో యాంగిల్‌ను చూపించాను అంటున్నాడు. వర్షం రీమేక్‌గా రూపొందిన బాఘీ సినిమాతో టైగర్‌ ష్రాఫ్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. అందుకే ఆ ప్రాంచైజీలో సినిమాలు చేస్తున్నాడు. వర్షం కథకు ప్రాంచైజీలో వచ్చిన ఇతర సినిమాలకు అసలు సంబంధం లేదు. పూర్తిగా కొత్త కథలు, పూర్తిగా కొత్త నటీనటులతో మాత్రమే ఈ సినిమాలు రూపొందినట్లు చెబుతున్నారు. బాఘీ ప్రాంచైజీ పై చాలా ఆశలు పెట్టుకున్న టైగర్‌ ష్రాఫ్‌ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి. మరీ ఇంత 'ఎ' కంటెంట్‌ను తీసుకు రావడం వల్ల కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారా అనేది కూడా చూడాలి.