అదీ సంగతి.. 'భాఘి 4' పబ్లిక్ టాక్
ఇటీవలి కాలంలో హింస, క్రూరత్వం, రక్తపాతం, ఊహించుకోలేని స్టంట్స్ తో దర్శకులు అనాగరిక ప్రపంచాన్ని చూపించాలనుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
By: Sivaji Kontham | 5 Sept 2025 10:18 PM ISTఇటీవలి కాలంలో హింస, క్రూరత్వం, రక్తపాతం, ఊహించుకోలేని స్టంట్స్ తో దర్శకులు అనాగరిక ప్రపంచాన్ని చూపించాలనుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హింసకు లాజిక్ అన్నదే లేదు. రక్తపాతం ఏరులై పారుతోంది. కత్తులు గొడ్డళ్లు, రంపాలు, వేట కొడవళ్లు .. ఒకటేమిటి భయానకమైన ఆయుధాలను ఉపయోగిస్తూ హీరో, విలన్ అనే తేడా లేకుండా అందరూ ఊచకోత కోయడంలో బిజీగా కనిపిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ కేటగిరీలోనే కిల్, యానిమల్, మార్కో లాంటి సినిమాలు వచ్చి బంపర్ హిట్లు కొట్టాయి. అయితే వాటిలో లాజిక్ తో పాటు యాక్షన్ కంటెంట్ రన్ అయింది. కానీ లాజిక్ తో పని లేకుండా, టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ నటించిన భాఘి 4లో యాక్షన్ సన్నివేశాలను చూపించారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథాంశం కూడా కొత్తగా ఏమీ కాదు. ఇప్పటికే సౌత్ ఆడియన్స్ కి బాగా తెలిసిన పాయింట్ నే దర్శకుడు ఉపయోగించుకున్నారు.
కొన్ని నెలల పాటు కోమాలో ఉన్న వ్యక్తి నిదుర లేచాక లేని ప్రియురాలిని ఊహించుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తుంటే, ఆ తర్వాత అతడి జీవితంలోకి విలన్ ప్రవేశిస్తే ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ. ప్రేమిస్తే భరత్ నటించిన 'అయింతు అయింతు అయింతు', గోపిచంద్ నటించిన 'ఒంటరి' సినిమాలో ఇదే పాయింట్ ఆధారంగా కథను నడిపించారు. ఇప్పుడు భాఘి 4లో అదే తెలిసిన పాయింట్ ని ఉపయోగించుకున్నారు. ఇది ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచిందని హిందీ సమీక్షకులు రాసారు. ఈ సినిమాకి 2 మించి రేటింగ్ ని ఇవ్వలేదు.
జుగుప్స కలిగించే రక్తపాతం, హింసతో ఈ మూవీ సైకో పాథిక్ వేలో భయపెడుతుంది.. జుగుప్స కలిగిస్తుంది. ఇలాంటి సినిమాలను వీక్షించేందుకు ఫ్యామిలీ ఆడియెన్ థియేటర్లకు రావడానికి సాహసించలేరు. రక్తపాతం భయంకరంగా ఉందని దీనిని పిల్లలు చూస్తే భయపడటం ఖాయమనేది పబ్లిక్ టాక్.
