Begin typing your search above and press return to search.

వీడియో : సూపర్‌ హిట్‌ ప్రాంచైజీకి కాస్త ఊరట!

బాలీవుడ్ యంగ్‌ హీరోల్లో టైగర్ ష్రాఫ్‌ ఒకరు. ఈయన కెరీర్‌ ఆరంభం నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొటూనే ఉన్నాడు.

By:  Ramesh Palla   |   19 Aug 2025 3:53 PM IST
వీడియో : సూపర్‌ హిట్‌ ప్రాంచైజీకి కాస్త ఊరట!
X

బాలీవుడ్ యంగ్‌ హీరోల్లో టైగర్ ష్రాఫ్‌ ఒకరు. ఈయన కెరీర్‌ ఆరంభం నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొటూనే ఉన్నాడు. బాఘీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో గుర్తింపు దక్కించుకున్నాడు. తన కెరీర్‌లో రెండో సినిమాగా టైగర్‌ ష్రాఫ్ బాఘీ సినిమాను చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాఘీ ప్రాంచైజీలో నాలుగు సినిమాలు చేశాడు. మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా, బాఘీ 4 సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతున్న బాఘీ సినిమా విషయంలో మొదటి నుంచి ఆసక్తి తక్కువగా ఉంది. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన ప్రాంచైజీ సినిమాలు, టైగర్‌ ష్రాఫ్‌ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అందుకే బాఘీ 4 విషయంలో మొదటి నుంచి కూడా కాస్త అనుమానాలు ఉన్నాయి. అందుకే బజ్ పెరగలేదు.

టైగర్‌ ష్రాప్‌ మరో యాక్షన్‌ మూవీ

బాఘీ 4 సినిమాతో ఎ హర్ష అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఇతడు చాలా కొత్తగా బాఘీ ప్రాంచైజీలో 4వ పార్ట్‌ తీశాడు అంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని సోషల్‌ మీడియాలో చిత్ర యూనిట్‌ సభ్యులు, పీఆర్‌ టీం ప్రచారం చేస్తున్నారు. అయినా కూడా పెద్దగా బజ్ క్రియేట్‌ కాలేదు. పైగా ఈ సినిమాలో హీరోయిన్‌గా హర్నాజ్‌ సంధు కాకుండా మరో హీరోయిన్‌ ఉండి ఉంటే బాగుండేది అంటూ మొదటి నుంచి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బాఘీ ప్రాంచైజీ సినిమా అనగానే అంతా యాక్షన్‌ సినిమాగానే భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన యాక్షన్‌ సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉంటుందేమో అని అంతా అనుకుంటున్నారు. కానీ బాఘీ 4 అందుకు విభిన్నంగా ఉంటుందని తాజాగా విడుదలైన గుజారా పాట చెప్పకనే చెబుతోంది.

గుజారా పాటతో బాఘీ 4 పై అంచనాలు పై పైకి

టైగర్‌ ష్రాఫ్, హర్నాజ్‌ కాంబోలో సాగే గుజారా పాట ఆకట్టుకుంటోంది. పాట విడుదలైనప్పటి నుంచి సినిమాపై పాజిటివ్‌ అభిప్రాయం ప్రేక్షకుల్లో పెరుగుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఈ పాట బైట్స్‌ వైరల్‌ కావడంతో సినిమా గురించి ఆరా తీయడం మొదలు అయింది. ఇదే జోరు కంటిన్యూ అయితే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్‌ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్‌ చాలా కష్టంగా మారింది. సినిమాకు హిట్ టాక్‌ వస్తే భారీ వసూళ్లు నమోదు కావడం కామన్‌గా జరుగుతుంది, కానీ మినిమం ఓపెనింగ్‌ అనేది మీడియం రేంజ్‌ సినిమాలకు సైతం చాలా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో బాఘీ 4 సినిమాకు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ కావడం వల్ల ఓపెనింగ్స్‌ మోస్తరుగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టైగర్‌ ష్రాఫ్‌, హర్నాజ్‌ ల రొమాంటిక్ నెంబర్‌

టైగర్‌ ష్రాఫ్‌, హర్నాజ్‌ సంధుల రొమాంటిక్ లవ్‌ స్టోరీ ఈ సినిమాలో ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టి పడేస్తుందనే విశ్వాసం పాటను చూస్తూ ఉంటే కలుగుతుంది. అంతే కాకుండా బాఘీ అంటే యాక్షన్‌ మూవీ అనుకునే వారికి ఈ పాట వారి ఆలోచన మార్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన భారీ యాక్షన్‌ సినిమాలతో పోల్చుతూ ఇన్నాళ్లు బాఘీ 4 సినిమా గురించి సోషల్‌ మీడియాలో మాట్లాడుకున్న జనాలు ఇప్పుడు ఇందులో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుందని భావిస్తున్నారు. అది ఖచ్చితంగా సినిమాకు ఊరట కలిగించే విషయం అనడంలో సందేహం లేదు. బాఘీ సినిమా ముందు ముందు మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు అందుకు తగ్గట్లుగా ప్రమోషన్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దర్శకుడు హర్ష అరంగేట్రం మూవీతోనే భారీ విజయాన్ని దక్కించుకుంటాడా అనేది చూడాలి.