Begin typing your search above and press return to search.

భారత్‌లోకి పాక్ స్పై ఎంట్రీ.. కానీ కథలో ఊహించని ట్విస్ట్!

ప్ర‌స్తుతం స్పై డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవలే విడుదలైన `ధురంధర్` చిత్రం బాక్సాఫీస్ ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   24 Sept 2026 2:07 PM IST
భారత్‌లోకి పాక్ స్పై ఎంట్రీ.. కానీ కథలో ఊహించని ట్విస్ట్!
X

ప్ర‌స్తుతం స్పై డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవలే విడుదలైన `ధురంధర్` చిత్రం బాక్సాఫీస్ ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వర్గాల్లో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా తెర‌కెక్కుతోన్న‌ `ఉడ్తా తీర్` అనే సరికొత్త చిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సీరియస్ దేశభక్తి లేదా విద్వేష పూరిత కథలకు భిన్నంగా ఈ సినిమాను ఓ కామెడీ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తుండటం విశేషం. ఇందులో కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా పాకిస్తానీ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.

ఒక కీలకమైన రహస్య మిషన్ మీద భారత్‌లోకి అడుగుపెట్టే పాక్ స్పైకి కథలో ఊహించని పెద్ద ట్విస్ట్ ఎదుర వుతుంది. భారతదేశ సరిహద్దు దాటి వచ్చిన వెంటనే ప్రమాదవశాత్తు ఆయన తన జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోతాడు. తానెవరో? ఏ దేశం నుంచి వచ్చానో? తన అసలు లక్ష్యం ఏంటో? కూడా మరిచిపోవడంతో కథనం ఎంతో ఆసక్తికరంగా నవ్వులు పూయించేలా మారుతుంది. వైవిధ్యమైన కథలను, కొత్తదనంతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ఆయుష్మాన్ ఖురానాకు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఇప్పటికే అనేక ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించిన ఆయుష్మాన్ ఈ సినిమాలో పాకిస్తానీ ఏజెంట్‌గా కామిక్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన స్పైగా ఆయన పండించే టైమింగ్, చూపించే హావభావాలు థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తాయని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన సారా అలీ ఖాన్ కథానాయికగా నటిస్తోంది. కథలో ఆమె పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అసలు విషయం తెలియకుండా జ్ఞాపకశక్తి పోయిన పాక్ ఏజెంట్ జీవితంలోకి ప్రవేశించడం.. వారిద్దరి మధ్య జరిగే నాటకీయ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

తెరపై ఇద్ద‌రి జోడీ ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా మంచి కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమ వుతోంది. సాధారణంగా స్పై సినిమాలంటే సస్పెన్స్, సరిహద్దు గొడవలు, భారీ యుద్ధ ఘట్టాలే ఉంటాయని అంతా అను కుంటారు. కానీ `ఉడ్తా తీర్` చిత్రాన్ని ఒక ఎస్పియోనేజ్ శాటైర్గా రూపొందిస్తున్నారు. నిఘా వ్యవస్థల పనితీరును, స్పై ఆపరేషన్లను సరదా ధోరణిలో చూపిస్తూనే కథలో ఆసక్తికర మలుపులను జోడించడం సినిమా ప్రత్యేకత. వినోదంతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు కథనంలో పొందుపరిచారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ అప్‌డేట్‌లు విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకున్నాయి. విలక్షణమైన కాన్సెప్ట్ కావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.