ఆ సర్ప్రైజ్ తెరపైనే చూడాలి.. థామాలో ముగ్గురు హీరోయిన్స్ పై హీరో రియాక్షన్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోరు పెంచేసింది. గత 3,4 సంవత్సరాలుగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఆ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది.
By: Madhu Reddy | 20 Oct 2025 9:00 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న జోరు పెంచేసింది. గత 3,4 సంవత్సరాలుగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఆ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికీ ఈమె చేతిలో సుమారుగా నాలుగు చిత్రాలకు పైగా ఉండడం గమనార్హం ..ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసిన చిత్రం థామా. అక్టోబర్ 21న అనగా రేపు దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టి బిజీ బిజీగా గడిపేస్తోంది చిత్ర బృందం.
అందులో భాగంగానే.. తాజాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఈ విషయంపై హీరో అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న చిత్రం థామా.. ఇందులో కొంతమంది స్టార్స్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి నిజమేనా? మరి వారెవరు? అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. దీనిపై ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. " అవును.. థామా అతిధి పాత్రలపై వస్తున్న రూమర్స్ గురించి మేము కూడా వింటున్నాం. అయితే ఇందులో ముగ్గురు స్టార్స్ అతిథి పాత్రలో కనిపిస్తారని మాత్రం నేను చెప్పగలను. కానీ వారు ఎవరు అనే సర్ప్రైజ్ మీరు తెరపైనే చూడాలి" అంటూ తెలిపారు ఆయుష్మాన్ ఖురానా. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ అతిధి పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది. థామా సినిమా విషయానికొస్తే.. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మలైకా ఆరోరా , రష్మిక చేసిన స్పెషల్ సాంగ్ ఐతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ పాట.
ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. మొత్తానికి అయితే ఈ సినిమా పిల్లలు పెద్దలు అన్ని వర్గాల వారు నిస్సందేహంగా సినిమా చూడవచ్చు. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు నిర్వహకులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఒక సీన్ లో వచ్చే నేపథ్య సంగీతం వాల్యూమ్ తగ్గించాలని అలాగే ఇక్కడ కొన్ని సన్నివేశాలను తొలగించాలని కూడా సూచించిందట చిత్ర బృందం. మొత్తానికి అన్ని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. మరి రష్మికకు ఈ బాలీవుడ్ చిత్రం ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
