కాపాడాల్సినవాడే కాలయముడయ్యాడు.. నటి ఆవేదన
ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం సినిమాల్లోకి రాకముందే చిన్నతనంలోనే లైంగిక వేధింపులను ఎదుర్కొంది.
By: Madhu Reddy | 18 Oct 2025 6:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో ఉండే అందరూ లైంగికంగా వేధిస్తారని కాదు.. కానీ కొంతమంది మాత్రం అక్కడక్కడ చీడ పురుగుల్లా కలుపు మొక్కల్లా ఉంటూనే ఉంటారు. ఇక ఈ క్యాస్టింగ్ కౌచ్ పై మీటూ లాంటి ఉద్యమాలు ఎన్ని వచ్చినా కూడా అవి జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ సైతం సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూ లలో బయట పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి సీనియర్ హీరోయిన్లే కాదు ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు కూడా బహిరంగంగానే పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. అయితే కొంతమంది వారిని వేధించిన వారి పేరుతో సహా చెబితే.. మరి కొంత మంది పేర్లు బయట పెట్టకుండా ఇండైరెక్ట్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం సినిమాల్లోకి రాకముందే చిన్నతనంలోనే లైంగిక వేధింపులను ఎదుర్కొంది. కాపాడాల్సిన వాడే కాలయముడయ్యాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎవరివల్ల వేధింపులకు గురైంది అనేది చూస్తే.. బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్.. అయేషా ఖాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఈ హీరోయిన్ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్లో ఈ హీరోయిన్ నటించిన మొదటి మూవీ ముఖచిత్రం.ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ అనే సినిమాలో తన గ్లామర్ తో మెరిసింది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ.. "చిన్నతనంలో నాకు ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయి. అది కూడా మా నాన్న ఫ్రెండ్ వల్ల.. ఓసారి చిన్నతనంలో నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వెనక నుండి ఎవరో పిలిచారని అక్కడే ఆగిపోయాను. అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మా నాన్న ఫ్రెండ్ ఉన్నారు. ఆయన్ని నేను బాబాయ్ అని పిలుస్తాను. ఆయన పిలిచారని అక్కడే ఆగితే నా దగ్గరికి వచ్చి నీ వక్షోజాలు అద్భుతంగా ఉన్నాయి అన్నాడు. కానీ ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏ ఉద్దేశ్యంతో అంటున్నారో కూడా నాకు అర్థం కాలేదు. ఏమీ తెలియని అయోమయ స్థితిలో నిల్చొని ఉండిపోయా.. ఆ తర్వాత బైక్ పై వెళ్తూ వెనక్కి తిరిగి నాకు కన్ను కొట్టి పిచ్చిపిచ్చి సైగలు చేసి వెళ్ళాడు.ఆ సమయంలో ఆయన చేసిన పనికి వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఏడ్చాను. ఆ సమయంలో ఆయన చేసిన పిచ్చి పనులు అంతగా అర్థం అవ్వకపోయినప్పటికీ ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది..బాబాయ్ అనుకుంటే అంత దారుణంగా నా పట్ల ప్రవర్తించడం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తాను" అంటూ షాకింగ్ విషయం బయట పెట్టింది అయేషా ఖాన్.
అలా చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ అయేషా ఖాన్ చెప్పుకొచ్చింది.ఇక ఈ హీరోయిన్ మాట్లాడిన వీడియో అప్పట్లో వైరల్ గా మారడంతో ఎవరిని నమ్మేలా లేదు.. కన్న తండ్రి అయినా తోడబుట్టిన అన్నా అయినా.. ఎవరి బుద్ధి ఎలా మారుతుందో అర్ధం అవ్వవడం లేదు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటూ మాట్లాడుకున్నారు. అలా అప్పట్లో పెద్ద ఎత్తున ఈ హీరోయిన్ మాట్లాడిన వీడియో వైరల్ గా మారి పాపులర్ అయిపోయింది.
అయేషా ఖాన్ సినీ కెరియర్ గురించి చూసుకుంటే.. హిందీ సినిమాలతో సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హిందీ తో పాటు బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది.అలాగే టాలీవుడ్లోకి ముఖచిత్రం అనే సినిమా ద్వారా వచ్చి శ్రీ విష్ణు, విశ్వక్ సేన్, శర్వానంద్ వంటి హీరోలతో నటించింది. అలా హీరోయిన్ గా నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్ లు కూడా చేస్తూ సౌత్ లో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొని తన ఆట తీరుతో మెప్పించింది.
