డివైన్ లుక్ లో ఆయేషా ఖాన్.. గ్రాంప్ టెంపుల్ సెట్
ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.
By: M Prashanth | 1 Oct 2025 4:00 AM ISTబిగ్ బాస్ షోతో బుల్లితెరపై సందడి చేసిన ఆయేషా ఖాన్ ఆయా సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయంతో పక్కింటి అమ్మాయిలా గుర్తింపు తెచ్చుకుంది. ఓం భీమ్ భుష్ సినిమాతో అచ్చం తెలుగుమ్మాయిలాగే గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంచుకుంటుంది. డైలీ రోటిన్, సినిమా అప్డేట్, స్టైలిష్ ఔట్ ఫిట్స్ ఇలా అన్ని అప్డేట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయేషా అమ్మవారి రూపంలో శారీలో కుర్చొని ఫొటోకు ఫోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో టెంపుల్ సెటప్ గ్రాండ్ గా కనిపిస్తుంది. సరస్వతి అమ్మవారిలా చేతిలో వీణ పట్టుకొని ఫుల్ ఆట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఆలయంలో విగ్రహంలా కూర్చొని ఉంది.
బంగారం వర్ణంలో ఉన్న పట్టు వస్త్రంలో ఆయేషా దగదగ మెరిసిపోతుంది. శారీకి ఉన్న జరీ అంచు అగ్ని కాంతిలా మెరుస్తోంది. శారీ డిజైనింగ్ లో సంప్రదాయం, హెరిటేజ్ ఉట్టిపడేలా డిజైన చేశారు. అది కేవలం ఒక వస్త్రంగా కాకుండా ఎలైవ్ ఫ్యాబ్రిక్ క్రాఫ్ట్ లాగా కనిపిస్తుంది. నేటి తరం ఫ్యాషన్ లాగా కాకుండా.. డివైన్ వైబ్స్ ఉట్టిపడేలా వారసత్వం కనిపించేలా ఈ ఫొటోలు ఉన్నాయి.
ఇక ఇక్కడ స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి. ఆమె ముఖంపై ఉన్న నాథ్, ఆమె మెడపై పేర్చబడిన చోకర్లు, ఆమె చేతులకు గాజులు చూస్తుంటే.. ఆమె ఒక అపురూప చిత్రం నుండి బయటకు అడుగుపెట్టినట్లు కనిపిస్తున్నాయి. బంతి పువ్వులా మెరిసే పువ్వులు ఆమె జడకు కిరీటంగా అలంకరించినట్లు ఉండగా... ఆమె తలపై రాళ్లు, రత్నాలు ఫేస్ లుక్ ను మరింత ఆకర్షించాయి. ఆమె చేతుల్లోని వీణ కూడా దానికి స్వయంగా ఆమెు చెందినదిగానే అనిపిస్తుంది.
చేతి వేళ్లకు మెహందీ, రాళ్లతో పొదిగిన ఉంగరాలు, కళ్ల కాటుక, ముక్కు పుడక ఇవన్నీ ఆమెను మరింత ప్రత్యేకంగా తీర్చి దిద్దాయి. ఈ అవతారంలో ఆమె అనేక ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా అట్రాక్షన్ గా ఉన్నాయని, ఈ ఔట్ ఫిట్ ఆమెకు మరింత అందం, అభినయం తీసుకొచ్చాయని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఆయేషాకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ట్రాగ్రామ్ లో 5కుపైగా మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో ఆమె కొలాబరేషన్స్, ప్రమోషన్స్ కు సంబంధించిన ఫోస్టులు కూడా షేర్ చేస్తుంటుంది. ఇక ఆయేషా కెరీర్ విషయానికొస్తే.. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే, జాట్ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం దిల్ కో రఫు కర్ లీ సీరియల్ లో నిక్కీ పాత్రను పోషిస్తోంది. అలాగే ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటుంది.
